YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యాప్ తో సర్కారీ స్కూళ్ల సమస్యల పరిష్కారం

యాప్ తో సర్కారీ స్కూళ్ల సమస్యల పరిష్కారం

సర్కారు బడుల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను వచ్చే విద్యా సంవత్సరంలో తీర్చేందుకు ప్రభుత్వం ముందకు వచ్చింది. దీని కోసమై టిఎస్ స్కూల్ యాప్ ద్వారా సమస్యలను జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. టిఎస్ స్కూల్ యాప్‌లో ప్రధానంగా పాఠశాల తరగతి గదులు, మరుగు దొడ్లు, టైలేట్సు, మద్యాహ్న భోజనం చేసే కిచెన్ షెడ్లు, గ్రంథాలయం, సైన్సు ల్యాబ్, ప్రహరి, ఆట స్థలం, తరగతి గదుల్లో ఫర్నిచర్ అన్ని వివరాలను పోటోలు తీసి జియోట్యాగింగ్ చేయాలి. ఇందులో ప్రతి మండలంలో సీఆర్‌టిల ద్వారా పాఠశాల చివరి పని దినాల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారి చేయడంతో సిఆర్టిలు ఈ పనిలో బిజీ అయ్యారు.ప్రభుత్వ బడులంటే సమస్యల సుడి గుండాలని అందుకే పోషకులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తీ చూపుతున్నారన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలలంటే సామాజిక దేవాలయాలుగా మార్చాలనే దృఢ సంకల్పంతో విద్యా శాఖ ఈ యాప్ ద్వారా ప్రతి పాఠశాలలో మౌళిక వసతులను చిత్రీకరించింది.జిల్లాలో ప్రైమరి పాఠశాలలు 575, మాద్యమిక పాఠశాలలు 105, ఉన్నత పాఠశాలలు 143 ఉన్నాయి. ఇందులో 67208 విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సిఆర్టిలు యూ డైస్ ఆధారంగా పాఠశాలల కోడ్‌ను నమోదు చేయాలి. వచ్చిన వివరాలను అక్కడి వాస్తవ పరిస్థిని నమోదు చేయడంతో పాటు చిత్రీకరించిన ఫోటోలు యాప్‌లో అప్లోడ్ చేయాలి. టిఎస్ స్కూల్ యాప్‌తో పాఠశాల సిగ్నల్ లో ఉందో లేదో అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. సిగ్నల్ పరిదిలో అన్ని పాఠశాలలు ఉన్నట్లయితే బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభిస్తే సత్ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుందని మండల ప్రజలు అభిప్రయపడుతున్నారు.

Related Posts