అమరావతి మే 24
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన హైవే కిల్లర్ మున్నా కేసులో న్యాయస్థానం 12 మందికి ఉరిశిక్ష విధించింది. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య ఘటనలో ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయి అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతోపాటు మరో 11 మందికి ఉరిశిక్ష విధించింది. మరో ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వీరంతా కలిసి మొత్తం ఏడు కేసుల్లో 13 మందిని హత్యచేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. వాటిలో మూడు కేసుల్లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది.