YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

యాంటీబాడీ కాక్‌టెయిల్‌ @ ₹59 వేలు

యాంటీబాడీ కాక్‌టెయిల్‌ @ ₹59 వేలు

Cipla: యాంటీబాడీ కాక్‌టెయిల్‌ @ ₹59 వేలు...   భారత్‌ మార్కెట్‌లో విడుదల చేసిన రోచ్‌ ఇండియా-సిప్లా.
దిల్లీ: కొవిడ్‌ బాధితుల చికిత్సలో ఉపయోగించే యాంటీబాడీ కాక్‌టెయిల్‌(కాసిరివిమాబ్‌, ఇమ్డివిమాబ్‌) భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.  ఔషధ తయారీ సంస్థ రోచ్‌ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని నేడు మార్కెట్‌లోకి విడుదల చేశాయి. దీని ధర డోసుకు రూ. 59,750గా నిర్ణయించినట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. తొలి బ్యాచ్‌లో భాగంగా లక్ష ప్యాక్‌లను ప్రస్తుతం మార్కెట్‌లోకి విడుదల చేశామని, జూన్‌ మధ్యలో రెండో బ్యాచ్‌ ప్యాక్‌లు అందుబాటులోకి తెస్తామని రోచ్‌ ఇండియా, సిప్లా ఓ ప్రకటనలో తెలిపాయి. ఒక్కో ప్యాక్‌ను ఇద్దరు రోగులకు అందించవచ్చని పేర్కొన్నాయి.
‘‘యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీనివల్ల కొవిడ్‌ బాధితులు ఆసుపత్రికి వెళ్లే అవసరం దాదాపు తగ్గుతుంది. అన్నిరకాల పన్నులతో కలిపి ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ 1200 ఎంజీ ఒక డోసు ధర రూ. 59,750. అన్ని ప్రధాన ఆసుపత్రులు, కొవిడ్‌ చికిత్సా కేంద్రాల్లో ఈ ఔషధం అందుబాటులో ఉంటుంది’’ అని రోచ్‌ ఇండియా సీఈవో వి సిమ్సన్‌ ఇమ్మాన్యుయెల్‌ తెలిపారు. ఈ ఔషధానికి భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
*ఏమిటీ కాక్‌టెయిల్‌?*
కొవిడ్‌ వైరస్‌ను ఎదుర్కొనే కాసిరివిమాబ్‌, ఇమ్డివిమాబ్‌ను కలిపి ఈ  ఔషధాన్ని అభివృద్ధి చేశారు. అత్యధిక రిస్క్‌లో ఉన్న.. తక్కువ నుంచి ఓ మోస్తరు లక్షణాలున్న రోగుల్లో దీన్ని వినియోగిస్తారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ రెండు ప్రతినిరోధకాలను మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ అంటారు. ఇవి మన శరీర రక్షణ వ్యవస్థను అనుకరిస్తూ హానికారక వైరస్‌ల పనిపడతాయి. ఇక సార్స్‌ కోవ్‌-2లోని స్పైక్‌ ప్రోటీన్‌పై పనిచేయడం వీటి ప్రత్యేకత. ఈ ప్రొటీన్‌ను అడ్డుకొంటే వైరస్‌ శరీరంలోని ఏసీఈ 2 కణాలకు అతుక్కోదు. ఈ రెండు యాంటీబాడీలు కలిసి స్పైక్‌ ప్రొటీన్‌లో ఒక ప్రత్యేకమైన భాగంపై పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో వైరస్‌లో మ్యుటేషన్లు ఏర్పడినా ఇది పనిచేస్తుంది. దీంతో కొత్త మ్యుటేషన్లను సమర్థంగా అడ్డుకొనే అవకాశం ఉంది.
తక్కువ లేదా ఓ మోస్తరు లక్షణాలు ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ఔషధాన్ని 12 ఏళ్లు దాటినవారిపై కూడా వినియోగించవచ్చు. ఒక్కో యాంటీబాడీ 600 ఎంజీ చొప్పున గల 1200 ఎంజీ ఔషధ సమ్మేళనాన్ని వినియోగించాలి. దీనిని చర్మం కింద ఉండే ఒకరకమైన కండరంలోకి లేదా నరాలకు ఎక్కించవచ్చు. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచవచ్చు. దీనికి సాధారణ రిఫ్రిజిరేటర్లు సరిపోతాయి. గుండె, మూత్రపిండాలు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారికి దీనిని వాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. యాంటీబాడీ కాక్‌టెయిల్‌ తీసుకొన్నవారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని దాదాపు 70శాతం తగ్గించినట్లు ప్రయోగాల్లో తేలింది. దీంతోపాటు నాలుగు రోజుల్లోనే వారు వేగంగా కోలుకొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా బారిన పడినప్పడు ఈ ఔషధాన్నే తీసుకున్నారు.

Related Posts