YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేబినెట్ విస్తరణ దిశగా అడుగులు..

కేబినెట్ విస్తరణ దిశగా అడుగులు..

విజయవాడ, మే 25, 
రెండేళ్ల మంత్రుల పనితీరుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తుంది. మంత్రుల శాఖల వారీ పనితీరు, వారికి అప్పగించిన జిల్లాల్లో పార్టీ పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వంటి వాటితో పనితీరును గణన చేస్తున్నారు. ఈ పనితీరు ఆధారంగానే వచ్చే విస్తరణలో చోటు ఉంటుందా? లేదా? అన్నది జగన్ నిర్ణయిస్తారు.రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని జగన్ తెలిపారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చి వేస్తారని, కొత్త వారికి అవకాశం కల్పిస్తానని జగన్ తొలి శాసనసభ్యుల సమావేశంలోనే చెప్పారు. దీంతో అనేక మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొన్ని శాఖలకు చెందిన మంత్రుల పనితీరు సక్రమంగా లేదని ఇప్పటికే జగన్ గుర్తించారు. వారికి అప్పగించిన శాఖలపైన కూడా కొందరు మంత్రులు శ్రద్ధ పట్టలేదని తెలుసుకున్న జగన్ వారిని మంత్రి పదవుల నుంచి తప్పించనున్నారు.మహిళా మంత్రులను పూర్తిగా మార్చివేయనున్నారని తెలిసింది. అదే సంఖ్యలో మహిళలకు కొత్త కేబినెట్ లో చోటు దక్కే అవకాశముంది. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మేకపాటి సుచరిత, తానేటి వనిత, పుష్పశ్రీవాణి లు ఉన్నారు. వీరి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు. తిరిగి హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన మహిళనే నియమించనున్నారన్న ప్రచరం జరుగుతోంది. అలాగే డిప్యూటీ చీఫ్ మినస్టర్ పదవి కూడా విస్తరణలో మరో మహిళకు కేటాయించనున్నారు.ఇక కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖ, నెల్లూరు, కడప చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుతమున్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదంటున్నారు. వారి స్థానంలో అదే సామాజిక వర్గాల వారికి చోటు దక్కే అవకాశముంది. ఎన్నికల కేబినెట్ కానుండటంతో ఈసారి జగన్ ఆచితూచి పదవులను భర్తీ చేయనున్నారు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం వారికి వచ్చే కేబినెట్ లో ప్రాధాన్యత దక్కే అవకాశముందంటున్నారు. మొత్తం మీద ఎన్నికల కేబినెట్ కోసం జగన్ పెద్దయెత్తున కసరత్తు చేస్తున్నారు.

Related Posts