YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనందయ్య మందుకు ఆమోదం

ఆనందయ్య మందుకు ఆమోదం

నెల్లూరు, మే 25, 
కరోనా మందు విషయంలో ఇప్పుడు దేశం మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా చూస్తుంది. కృష్ణపట్నంలో తయారు చేసిన మందుకి సంబంధించి దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ మందు తయారి విషయంలో ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక కృష్ణపట్నంలో భారీగా పోలీసులు మొహరించారు. సీవీఆర్ అకాడమీలో మందు తయారీకి ఏర్పాట్లు చేసారు. ఐసీఎంఆర్ బృందం పర్యటన వాయిదా పడింది. ఆయుష్ నివేదిక సరిపోతుందని ఐసీఎంఆర్ ఆభిప్రాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఆనందయ్య మందుకి అనుమతి వస్తుందా? రాదా? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మందు తయారికి ఏర్పాట్లు చేయడంతో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే అనే అభిప్రాయం నెల్లూరులో ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు విషయంలో ఇప్పుడు కాస్త ఉత్కంట నెలకొంది. ఈ మందు విషయంలో పరిశోధనలు జరుగుతాయా లేదా అనే దానిపై అసలు ఏమీ అర్ధం కావడం లేదు. ఇక ఆనందయ్య మందుపై ఐసిఎంఆర్ పరిశీలన ఉండక పోవచ్చు అని అధికారులు అంటున్నారు. ఐసీఎంఆర్కి సంబంధం లేకుండానే మందు తయారీ, పంపిణీ కి కసరత్తు చేస్తున్నారు. మందు హానికరం కాదని ఆయుష్ అధికారులు నివేదిక ఇచ్చారు. ఐసిఎంఆర్ పరిశీలించినా ఆమోదం ఉండక పోవచ్చు అనే వాదన ఒకటి వినపడుతుంది. క్లీనికల్ ట్రయిల్స్, ఇతర పరీక్షలు లేకుండా ఐసిఎంఆర్ ఆమోదం లభించదు అని అధికారులు అంటున్నారు. దీనితో ఐసిఎంఆర్ తో సంబంధం లేకుండానే పంపిణీ కి రాష్ట్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రకటన కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.

Related Posts