YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఈ నెల 26 బుధవారం చంద్రగ్రహణం

ఈ నెల 26 బుధవారం చంద్రగ్రహణం

ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం త్వరలో రానుంది. మే 26 బుధవారం వైశాఖ పూర్ణిమ రోజన జరగబోతుంది. ఈ రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్ర గ్రహణం ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కనిపించదు. ఎందుకంటే ఈ గ్రహణం ప్రారంభమైనప్పుడు భారత్ లో ఎక్కువ భాగం పగలు ఏర్పడుతుంది. అయితే ఇలాంటి పరిస్థితిలో ఈ గ్రహణం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారత్ లో ఎక్కువ భాగం ఇది కనిపించదు కాబట్టి సూతక కాలాన్ని పరిగణనలోకి తీసుకోరు. గ్రహణం కనిపించే ప్రదేశాలు లేదా దేశాల్లో మాత్రమే సూతక కాలాన్ని పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చంద్రగ్రహణం గురించి మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
*​ఈ ప్రదేశాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుంది..*
మే 26 సాయంత్రం ఏర్పడే ఈ చంద్ర గ్రహణం భారత్ లో ఈశాన్య రాష్ట్రాలు అయినా అరుణాచల్ ప్రదేశ్ , మిజోరాం , బంగాల్ , నాగాలాండ్ , త్రిపుర , తూర్పు ఒడిషా , మణిపుర్ , అసోం , మేఘాలయలో కనిపిస్తుంది. భారత్ తో పాటు చంద్ర గ్రహణం జపాన్ , బంగ్లాదేశ్ ,  సింగపూర్ , మయన్మార్ , దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ , ఉత్తర అమెరికా , దక్షిణ అమెరికా పసిఫిక్ , హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారత్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణం సూతక కాలం పరిగణనలోకి తీసుకుంటారు.
*​మే 26 చంద్ర గ్రహణం సమయం..*
పంచాంగం ప్రకారం 2021 మే 26న ఉదయం 06.15 గంటలకు గ్రహణ కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాలు , ఇంట్లో పూజామందిరాలు , ప్రార్థానాస్థలాలు మూసివేస్తారు. అలాగే ఈ సమయంలో భగవంతుడిని తాకరు. దీంతో పాటు దేవాలయంలో కూడా ఆరాధన కార్యక్రమాలు నిర్వహించరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుభ్రపరిచడం ద్వారా ఆరాధన పనులు ప్రారంభమవుతాయి. సూతక కాలం గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు ప్రారంభవుతుంది. గ్రహణం ముగిసే వరకు ఉంటుంది.
*​చంద్ర గ్రహణం 2021 సమయం , వివరాలు..*
సూతక కాలం ఆరంభం- ఉదయం 06.15 గంటలకు
గ్రహణం ఆరంభం- మధ్యాహ్నం 03.00 గంటలకు
ఖాగ్రాస్ ప్రారంభం- మధ్యాహ్న 4.40 గంటలకు
గ్రహణ మధ్య కాలం- 04.49 గంటలకు
గ్రహణం ముగింపు- 06.23 గంటలకు
*​చంద్ర గ్రహణం ప్రభావం..*
వైశాఖ పూర్ణిమ రోజు గ్రహణం కారణంగా బీహార్ , ఒడిషా , బంగాల్ , తూర్పు రాష్ట్రాలకు ఈ గ్రహణ ప్రభావవంతంగా ఉంటుంది. సీనియర్ వ్యక్తి నుంచి అశుభ సమాచారం అందవచ్చు. ఈ చంద్ర గ్రహణం బ్రెజిల్ , అల్జీరియా , మయాన్మార్ లాంటి దేశాలకు ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో నష్టం ఉంటుంది. నువ్వులు , పత్తి , నూనె , మినుమల ధర పెరుగుతుంది. తూర్పు ఆసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి.
*​2021లో ఏర్పడే గ్రహణాలు..*
ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాలు కాగా.. మిగిలిన రెండు చంద్ర గ్రహణాలు. ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం జూన్ 10న ఏర్పడనుంది. రెండోది డిసెంబరు 4న సంభవించనుంది. దీంతో మొదటి చంద్ర గ్రహణం మే 26న, రెండో చంద్ర గ్రహణం నవంబరు 19న జరుగుతుంది. ఈ గ్రహణాల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడనున్నాయి.

వరకాల మురళీమోహన్గారి సౌజన్యంతో 

Related Posts