YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అభివృద్ధి ప‌నుల‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి !! మంత్రి పేర్ని నాని

అభివృద్ధి ప‌నుల‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి !!   మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం:  మే 25

మచిలీపట్నం నగరపాలక సంస్థ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ‌ల మంత్రి  పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అధికారులకు సూచించారు.మంగళవారం ఉదయం మచిలీపట్నం లోని అర్ అండ్‌ బీ అతిథి గృహంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ వార్డులలో నిలిచిపోయిన రోడ్లను మ‌ర‌మ్మతుల పనులు,  రిజర్వాయర్ల నిర్మాణం, అంత‌ర్గత రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, పార్కుల నిర్మాణం ప‌నుల‌ను సత్వరం పూర్తిచేయాలని ఎప్పటినుంచి ఆయా పనులను సంబంధిత  కాంట్రాక్టర్ల నుంచి లిఖితపూర్వకంగా ఒక తారీఖు నమోదు చేసి వారిని ఆయన పనులను ప్రారంభించేవరకు వారిని వెంటాడాలని మంత్రి తెలిపారు. అలాగే కరోనా రెండవ దశ ప్రబలుతున్న వేళ వసతి లేని వలస కార్మికులకు వరలక్ష్మి పాలిటెక్నీక్ లో 10 రోజుల పాటు ఉండేందుకు గదుల సదుపాయం వసతి  తదితర ఏర్పాట్లు బుధవారం పనుల జరగాలని మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణకు మంత్రి పేర్ని నాని ఆదేశించారు.  మచిలీపట్నం మునిసిపాలిటీ 14 వ ఆర్ధిక సంఘ నిధులు 2 కోట్ల 24 లక్షల నిధులు పెండింగ్ లో  ఉన్నాయని, అలాగే జనరల్ ఫండ్ 1 కోటి 74 లక్షలు బడ్జట్ ఉన్నప్పటికీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అవి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉందని మంత్రి పేర్ని నాని చెబుతూ, ఈ విషయమై ఫైనాన్స్ కార్యదర్శి సత్యనారాయణతో ఫోన్ లో సంభాషిహించారు.4 కోట్ల రూపాయల నిధుల  విడుదల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందని మంత్రి ఆయనను ప్రశ్నించారు.  జూన్ నెల 1 వ తారీఖున ఆ మొత్తం విడుదల కానున్నట్లు ఫైనాన్స్ సెక్రటరీ మంత్రికి జవాబిచ్చారు.  స్థానిక గిలకలదిండి లో సచివాలయం పక్కన రోడ్డు, డ్రైన్ నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఆ పనులు చేసే కాంట్రాక్టర్ ను మంత్రి ప్రశ్నించగా  , తమకు ఇసుక కొరత ఉందని ఆయా పనులను చేసే కాంట్రాక్టర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇసుక కొరతే లేదని టన్ను 450 రూపాయలకు మీకు సమీపంలోని ఇసుక రీచ్ లలో లభ్యమవుతుందని చెబుతూ,  జాయింట్ కలెక్టర్ మాధవీలతతో ఫోన్ లో మంత్రి పేర్ని నాని  మాట్లాడి శ్రీకాకుళంలో ఫైన్ క్వాలిటీ ఇసుక దొరుకుతుందని లారీ తీసుకువెళ్లి ఇసుక తెచ్చుకొని ఆయా పనులు త్వరగా ప్రారంభించాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ, మునిసిపల్ ఎం ఇ  త్రినాథ రావు, హెల్త్ ఏ ఇ రామ్ ప్రసాద్, ఏ ఇ లు పిల్లి ప్రసాద్ , వరప్రసాద్, ఏ సి పి నాగ శాస్త్రులు, పలువురు కాంట్రాక్టర్లు తదీతరులు పాల్గొన్నారు.  

Related Posts