YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

"కాలనీ కేర్ కరోనా సెంటర్".

"కాలనీ కేర్ కరోనా సెంటర్".

వైరస్ అరికట్టేందుకు అనుసరించాల్సిన మార్గాలు...
*మనకోసం మనమే.ప్రతి ఒక్కరూ మానవత్వంతో సంఘటితం కావాలి.
* అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ కేర్ ఫ్రమ్ కరోనా.
*హోమ్ క్వారంటైన్ కన్నా కమ్యూనిటీ  క్వారంటైన్ నే సురక్షితం..
*పాజిటీవ్ వచ్చిన వ్యక్తి కి దగ్గరగా ఐదు నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఉంటే వైరస్ మీకు వస్తుంది.
* రోజు విడిచి రోజు మాత్రమే సిబ్బంది విధులు నిర్వహించాలి.
* రోజుకో క్రొత్త వైరస్ వ్యాప్తి...
* వ్యాక్సినేషనే ప్రధమ రక్షణ..
* మానసిక ధైర్యం, ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.
ఏ టివి చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా దడ పుట్టించే బ్రేకింగ్ న్యూస్ లే మోత మ్రోగిస్తున్నాయి. కరోనా రెండోదశే పూర్తిగా  పోలేదు. ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ మరియు ఎల్లో ఫంగస్ అనే  క్రొత్త క్రొత్త వ్యాధులు సక్రమిస్తున్నాయని  అవి అత్యంత ప్రాణహాని కల్గిస్తాయని నిపుణులు అంటున్నారు.  ఇవి ఇలావుంటే కరోనా మూడో దశ ప్రవేశించిందశని ఇది చిన్న పిల్లలనోలే వ్యాపిస్తుందని, అది అరికట్టాలంటే పిల్లలందరికీ త్వరగా  వ్యాక్సిన్ వేయాలని లేదంటే వైరస్ సోకిన పిల్లల్ని కాపాడుకోవడం కష్టమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియ చేసింది.  ఇప్పటి వరకూ 40 శాతం మంది జనాభాకి కోడా పూర్తిగా వ్యాక్సిన్  వేయలేదు. గత పది రోజులుగా  వాక్సిన్ వేయడం నిలిపివేసి , నిన్నటి నుంచి పునఃప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం  నిర్ధేశించిన ప్రకారం  వయస్సు ప్రాతిపదికన  అర్హులైన వారందరికీ రెండో డోస్ బుధవారం వరకు  వేయడం జరుగుతుందన్నారు.  18 నుండి 44 సంవత్సరాల వాళ్ళకు వ్యాక్సిన్ కేంద్రాలవద్దనే వారి వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు..ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలనే తొందరలో కేంద్రాల వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగడం తో  దీనివల్ల  వైరస్  వ్యాప్తి విపరీతంగా సోకే ప్రమాదం ఉంది.  అలాకాకుండా గతం లో ఉన్న నిబంధననే కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ ల ద్వారా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "కోవిన్' లేదా "ఆరోగ్య సేతు"యాప్ ల ద్వారా తమ వివరాలు  నమోదు చేసుకోవాలి. తద్వారా  వీరికి కేటాయించిన తేదీ, సమయానికి  ఆయా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలి.  లాక్ డౌన్ విధించినా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  అదృష్ట వశాత్తు  పాజిటీవ్ వచ్చిన రోగులు సంఖ్య తగ్గుతోంది.
*వ్యక్తిగత దూరం పాటించి తీరాలి.
వ్యక్తికి దగ్గరగా ఓ ఐదునిముషాలకన్నా ఎక్కువ సమయం గడిపితే  వైరస్ సోకుతుందని, అది 15 నిమిషాల్లో ఇతరులకు వ్యాపిస్తుందని  విజయవాడలో సుప్రసిద్ధ వైద్యులు గా కీర్తి గడించిన  డాక్టర్ టి.వి.ఏ.ఎస్ శర్మ  తెలియచేస్తున్నారు.  అత్యంత అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని , బయటకి వెళ్ళినప్పుడు వైరస్  క్యారియర్స్ ఎవరో తెలియదనీ, అందుకే గుంపుగా చేరిన జనాల మధ్య  ఎట్టి పరిస్థితుల్లో 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండవద్దంటున్నారు.వ్యక్తిగత దూరం తప్పక పాటించి తీరాలని సూచిస్తున్నారు.
* రోజు విడిచి రోజు మాత్రమే  సిబ్బంది విధులు నిర్వహించాలి.
ఇక రోజూ ప్రజలకోసం నిత్యావసరాలు అందించే అనేక మంది ఉద్యోగులు , వ్యాపారులు , ప్రజల రక్షణ చూసే పోలీసులు, పారిశుద్ద కార్మికులు అన్ని శాఖల ఉద్యోగులు షిఫ్ట్ ల వారిగా,  రోజు విడిచి రోజు మాత్రమే విధుల్లో పాల్గొనేలా చూడాలని,  లేదంటే వీరి ద్వారా కూడా  తెలియకుండానే  వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని  డాక్టర్ శర్మ సూచిస్తున్నారు.  
*రోజుకో క్రొత్త వైరసు..
ఇది ఇలాఉంటే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్,ఇప్పుడు ఎల్లో ఫంగస్ ఇలా రోజుకో క్రొత్త క్రొత్త వైరస్సులు పుట్టుకొస్తున్నాయి.  కరోనా మూడో దశ ఇప్పుడు చిన్న పిల్లల్ని చుట్టేయ నుందని . త్వరగా చిన్నపిల్లలకు కోడా వ్యాక్సిన్ వేసి వారందరిని కాపాడుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచింది.  హైదరాబాద్ లో సుమారు 800 మందికి బ్లాక్ ఫంగస్ సోకిందని సమాచారం.దీనికి తోడు కొందరిలో వైట్ ఫంగస్ కోడా వ్యాపించిందని వార్తలు వచ్చాయి.  ఇప్పటికే  కరోనా పాజిటీవ్ వచ్చి అనేక మంది చనిపోయారు,  వేలాది మంది అన్ని ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు, కొందరు ఐ. సి.యూ.లో కొందరు వెంటిలేటర్ పై వైద్యం తీసుకుంటున్నారు. ఎక్కడకు  వెళ్లినా  బెడ్లు లేవు, ఆక్సిజెన్ లేదు, అంబులెన్స్ లొనే చక్కర్లు కొడుతున్నారు.  చాలా మంది హోమ్ క్వారంటైన్ లోనే ఉంటున్నారు.  ఒక కుటుంబంలో ముగ్గురికో , నల్గురికో కరోనా వస్తే వారు ఒక్కొక్కరూ ఒక్కోగదిలో ఉంటూ డాక్టర్లు సూచించినట్లు మందులు వేసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు.  కానీ ఇక్కడే అనేక సమస్యలు వస్తున్నాయి..కొంతమంది ఉండే ఇల్లు చాలా చిన్నది ఒకే గది , ఒకటే బాత్రూమ్, కొందరు  నివసించే ఇళ్లల్లో రెండు టాయిలెట్స్ ఉన్నా  కరోనా సోకిన వాళ్ళు, లేని వాళ్ళు అదే బాత్రూమ్ వాడాల్సి వస్తోంది. దానివల్ల మిగిలిన వారికి కోడా వైరస్ అంటు కుంటోంది.  వ్యాధి లేని వారొక్కరే ఎంతో జాగ్రత్త  అందరికీ  అన్నీ చేసి పెట్టాల్సి వస్తోంది...ఇలాంటి పరిస్థితుల్లో పనిమనుషులు రావడంలేదు,  పనంతా ఒక్కరే చేసిపెట్టి ఈ వైరస్ కి గురి అవుతున్నారు..ఇలా ఇంటిల్లిపాది వైరస్ బారిన పడితే వారి అవస్థ వర్ణనా తీతం.  హోమ్ క్వారంటైన్ లో ఉండే అందరికి ప్రత్యేక సదుపాయాలు సరిగ్గా లేక  వార్ని నిరంతరం సరిగ్గా చూసుకునేవాళ్ళు లేక పోవడంతో శీఘ్రముగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.  ఇరుగుపొరుగువారు పలకరిస్తే పాపం అన్నట్లుగా ఉంటున్నారు కనీసం కన్నెత్తి చూడటం లేదు. అపార్టుమెంట్స్ లో నివసించేవారి పరిస్థితి చెప్పనక్కర్లేదు.  
* ప్రతి ఒక్కరూ మానవత్వం చాటుకుని సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది.
* అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ కేర్ ఫ్రమ్ కరోనా.
*హోమ్ క్వారంటైన్ కన్నా కమ్యూనిటీ  క్వారంటైన్ నే సురక్షితం..కాలనీ కేర్ కరోనా సెంటర్.
హాస్పిటల్స్ అన్నీ రోగులతో నిండి పోవడం ప్రభుత్వాలు ఎన్ని కోవిడ్ వార్డులు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదు ఈ తరుణంలో  సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ ఇప్పుడే నిజమైన మానవత్వం చూపించాలి, అనుమానాలు, భయాలు అసూయ ద్వేషాలు, మాని సమిష్టిగా ప్రభుత్వ సహకారంతో స్థానికి నేతలు , అధికారులతో వారుండే వీధిలో పెద్దమనుషులతో  కల్సి ఒక " కరోనా కేర్ కమిటీ అసోసియేషన్" గా ఏర్పడాలి.   తమ తమ వాడల్లో , కాలనీల్లో , అపార్టుమెంట్ల దగ్గర "కరోనా కేర్ సెంటర్ల"ను  పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో  ఆ ఏరియాను బట్టి బెడ్డులు , ఒక, రెండు  ఆక్సిజెన్ సిలిండర్లు, గ్రీన్ టాయిలెట్స్, నిరంతరం పర్యవేక్షించే వైద్య బృందం, రోగుల్ని చూసుకునేందుకు  కొంత సిబ్బంది, 24 గంటలూ అందుబాటులో ఉండే ఓ అంబులెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. వీటి నిర్వాహణ కోసం రోగుల నుండి నామమాత్రపు రుసుము మాత్రమే తీసుకోవాలి .. ఇప్పటికే  కోవిడి బాధితుల కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పౌష్టికాహారం ఉచితంగా అందిస్తున్నారు.  దీనిని ప్రభుత్వ కోవిడ్ హాస్పిటల్ తో అను సంధానంగా ఏర్పాటు చేసుకోవాలి.  వారు ఉండే  వీధి లో ఏరోజుకారోజు ఎంత మందికి పాజిటీవ్ వచ్చిందో తెలుసుకొని ప్రాథమిక దశలో ఉంటే వారందర్నీ ఈ కాలనీ కరోనా కేర్ సెంటర్ లో చేర్పించాలి.  హోమ్ ఖ్వారంటైన్ కి బదులుగా ఈ కాలనీ క్వారెంటైన్  ఎంతో సురక్షితంగా ధైర్యాన్ని ఇస్తుంది.. పాజిటీవ్ వచ్చిన మొదటి ఐదు రోజుల్లో డాక్టర్లు సూచించిన మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం ఉండదు.. మీ ఇళ్ల దగ్గర్లో , అపార్టుమెంట్స్ దగ్గర్లో , కాలనీల్లో   ఈ  "కాలనీ కరోనా కేర్ సెంటర్ ని " ఏర్పాటు చేసుకోవచ్చు .  అందుకోసం ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, కాలేజీస్ , పెద్ద ఖాలీ స్ధలం లో ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల వైరస్ వ్యాప్తి ఇతర సభ్యుల కు సోకదు, ఒకే చోటే కేంద్రీకృతమవుతుంది..  ఇక్కడ చేరిన వారందరికీ తమకు నలుగురున్నారన్న ధైర్యం ఉంటుంది..
పండగలప్పుడు ,ఫంక్షన్లలప్పుడు  కలసి మెలిసి ఆనందించడం సంతోషంగా గడపడం కాదు ఇలాంటి విషమ పరిస్థితుల్లోనే ఒకరికి ఒకరు తోడుండాలి. ఇది సత్ఫలితాల్ని ఇస్తుంది.  ఇతర కారణాలవల్ల కరోనా లక్షణాలు తగ్గకుంటే  అత్యవసర చికిత్స కోసం  ఈ సెంటర్ కి అనుసంధానం చేసుకున్న ప్రభుత్వ కోవిడ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి.  ఇక నిత్యం ప్రజలకోసం  అత్యవసర సేవలు చేసే అనేక మంది ఉద్యోగులు రోజు విడిచి రోజు విధుల్లో పాల్గొనేలా చేయాలి. వ్యాక్సిన్ కొరత తీరి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు , హాస్పిటల్స్ లో బెడ్ల కొరత తీరేదాకా  మనల్ని మనం కాపాడుకోవాలి, మన ప్రక్క వారి కోసం మనమంతా తోడుండాలి.  సమిష్టిగా ఉండాలి సమస్యను పరిష్కరించుకోవాలి. సమయం లేదు మిత్రమా..సిద్ధంకండి.
Courtesy: శ్రీ సురేష్ కశ్యప్

Related Posts