YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పంచముఖ ఆంజనేయస్వామి

పంచముఖ ఆంజనేయస్వామి

మన హిందూమతంలో ఐదు  సంఖ్యకు చాలా విశిష్టత వుంది. పంచభూతాలు, పంచాక్షరి పంచయజ్ఞాలు, పంచేంద్రియాలు, పంచారామాలు పంచపాండవులు ఇలా చాలావాటిలో ఐదు సంఖ్య ప్రాముఖ్యత కలిగివుంది. 
మహావిష్ణువు రామునిగా అవతారం దాల్చగా ఆయన ముఖ్య పరివారం కూడా పలు పలు రూపాలతో  భూలోకంలో జన్మించారు. రామ భక్తుడైన ఆంజనేయస్వామిలో రుద్రాంశ వున్నది. రుద్రుడు శత్రు వినాశకారకుడు.  దుష్ట శక్తులను సర్వనాశనం చేసే శక్తి  రుద్రాంశకు కలదు. రామాయణంలో ఇంద్రజిత్ , రావణాసురుడు, మొ.వారు నాశనమవడానికి,  రామలక్ష్మణులు  సంజీవినీ పర్వతం వలన కాపాడబడడానికి ఆంజనేయుని మహత్తర శక్తి ఎంతో తోడ్పడింది. సదా రామనామ జపంలోనే మునిగినవాడు  ఆంజనేయస్వామి. రుద్రాంశ కలిగిన ఆంజనేయస్వామి పంచముఖములు కలిగి విశ్వరూప ఆంజనేయస్వామిగా దర్శనమిస్తున్నాడు. తూర్పుముఖ ఆంజనేయ స్వామి దర్శనం మన పాపాలను నశింపచేస్తుంది. దక్షిణ దిశ ముఖానవున్న  నరసింహస్వామి దర్శనం చేత మన శత్రువులను సర్వ నాశనం చేస్తుంది.  పడమటిముఖంగా వుండే గరుడభగవానుని దర్శనం ఎటువంటి కఠోర విషాలనైనా విరిచి నిర్మూలిస్తుంది. ఉత్తరముఖంగా వుండే  లక్ష్మీ వరాహస్వామి దర్శనంవలన మనకి గ్రహదోషాలు తొలగి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఊర్ధ్వముఖంగా వుండే హయగ్రీవ స్వామి దర్శనం వలన మనకి జ్ఞానం, కార్యసిధ్ధి, సంతానం, విద్యాబుధ్ధులను అనుగ్రహిస్తుంది. 
మంత్రాలయా రాఘవేంద్రస్వామి వారి  ఉపాసనా దైవం పంచముఖ ఆంజనేయస్వామి. అక్కడ పంచముఖ ఆంజనేయస్వామికి  ఒక ఆలయం నిర్మించబడి వున్నది. పంచముఖ ఆంజనేయస్వామి రూపాలు గల ఆలయాలు మన దేశంలో చాలా ఊళ్ళలో వున్నవి.
చెన్నై కి సమీపమునున్న తిరువళ్ళూరు , పుదుచ్చేరి సమీపమున పంచవటి అనే ఊరిలో పంచముఖ ఆంజనేయస్వామి  ఆలయాలు ప్రసిధ్ధిచెందాయి. చెన్నైకి సమీపమున దేవిమీనాక్షి నగర్ లో 32 అడుగుల ఎత్తుగల పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వున్నది. పంచ ముఖాలే కాకుండా దశముఖాలు కలిగిన ఆంజనేయస్వామి కూడా వున్నాడు. ఆంజనేయస్వామి పంచముఖాలతో దర్శనమివ్వడానికి కారణాలు మన పురాణాలు వివరించాయి. మనలో చాలామందికి రావణుడు అనగానే సీతను అపహరించినవాడు అనే అనుకుంటారు. కానీ ఆ రావణునికి మరో సోదరుడున్నాడు అతడే మహిరావణుడు. రామునితో యుధ్ధం చేసిన  రావణాసురుడు తన ఆయుధాలు నాశనంకాగా నిస్సహాయుడై కూలబడ్డాడు. అప్పుడు, కరుణామూర్తి అయిన రాముడు  యుధ్ధం చాలించి " రావణా ! ఈ రోజుకి యుధ్ధం చాలించి రేపు రా.. " అని వదిలేసాడు. రావణుడు తప్పు తెలుసుకుంటాడని రాముడు తలచాడు. కాని అతను పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ తన సోదరుడైన  మహిరావణుని సహాయం కోరాడు. అప్పుడు మహిరావణుడు రామలక్ష్మణులను నాశనంచేయడానికి ఒక యాగం ఆరంభించాడు. ఆయాగాన్ని అడ్డగించడానికి ఆంజనేయుడు భయంకరమైన విశ్వరూపాన్ని ధరించాడు  తనలోనే శ్రీ నరసింహస్వామి, శ్రీ హయగ్రీవ స్వామి,  శ్రీ లక్ష్మీవరాహస్వామి,  మొదలైన పంచముఖరూపం ధరించాడు. వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆంజనేయునిచే మహిరావణాసురుడు సంహరించబడినాడు. మహిరావణ సంహారానికి ధరించిన రూపమే  పంచముఖ  ఆంజనేయస్వామి రూపము.
కుంభకోణంలో పంచముఖ ఆంజనేయస్వామికి విగ్రహం మలచబడినది. పంచముఖ ఆంజనేయస్వామి ని ధ్యానించిన  మన జీవితంలో అనుకున్న కార్యాలు అన్నీ  విజయం సాధిస్తాయి.
అసాధ్యసాధక స్వామి న్
అసాధ్యం తవకిమ్ వద
రామ దూత కృపాసింధో మత్
కార్యం సాధయ  ప్రభో..
ఏ కార్యమునైనను చేయడానికి  ముందు, హనుమంతుని తలచుకుని యీ మంత్రాన్ని 27 సార్లు జపిస్తే సకల శుభాలు చేకూరుతాయి.

వరకాల మురళీమోహన్గారి సౌజన్యంతో

Related Posts