YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లాస్ట్ చాన్స్ పేరుతో ప్రచారం

లాస్ట్ చాన్స్ పేరుతో ప్రచారం

విజయవాడ, మే 26, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన సానుభూతితోనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాల్సి ఉంటుంది. మరో దారి లేదు. జగన్ పాలనపై ఇప్పటికీ పెద్దగా వ్యతిరేకత కన్పించడం లేదు. తొలిసారి ముఖ్యమంత్రి అయినా జగన్ సమర్థవంతంగానే పాలన సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలను నిలిపివేయడం లేదు. కరోనా సమస్య తాత్కాలికమే. దీంతో చంద్రబాబు తనకు చివరిఛాన్స్ అని సానుభూతి కోసం వచ్చే ఎన్నికల్లో ప్రయత్నించాల్సి ఉంది.చంద్రబాబుకు ఇప్పటికే 70 ఏళ్లు దాటిపోయాయి. అయినా ఆయన హుషారుగానే ఉన్నారు. యువనేతలకంటే ఉత్సాహంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంటేనే తనకు విజయం దక్కుతుందని చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ రెండేళ్లలో పెద్దగా ప్రజల్లోజగన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కన్పిచడం లేదు. తన నాయకత్వంపై ప్రజలకు చెప్పాలన్న ఎదురుగా గత ఐదేళ్ల పాలన కన్పిస్తుంది.తన వయసు అయిపోయిందని, ఇదే తనకు చివరి ఛాన్స్ అని చంద్రబాబు వచ్చే ఎన్నికలకు వెళ్లనున్నారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని జగన్ వెళ్లి విజయం సాధించడంతో అదే నినాదాన్ని మార్చి లాస్ట్ ఛాన్స్ అని చంద్రబాబు ఎన్నికలకు వెళతారని తెలుస్తోంది. 2029 తర్వాత తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. ప్రజల్లో సానుభూతి దీని వల్లనే వస్తుందన్న విశ్వాసంతో చంద్రబాబు ఉన్నారు.అయితే సానుభూతి అన్నది ఇప్పుడు పెద్దగా పనిచేయడం లేదు. రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఎన్టీఆర్ కే సానుభూతి దక్కలేదు. మరి చంద్రబాబు వంటి నేతకు ప్రజలు సానుభూతితో ఆదరిస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. ఇప్పుడు చంద్రబాబు ఎదుట లాస్ట్ ఛాన్స్ అనే నినాదం తప్ప మరోటి లేదు. ఆ దిశగానే ఆయన భవిష్యత్ రాజకీయం ఉండబోతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చంద్రబాబుకు ఈ లాస్ట్ ఛాన్స్ నినాదం పనిచేస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts