YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు బయిట పల్లకీల మోత

జగన్ కు బయిట పల్లకీల మోత

తిరుపతి, మే 26, 
జగన్ పేరు వింటే ఏపీలో ని విపక్షానికి పూనకం వస్తుంది. కరోనాతో సహా అన్ని అనర్ధాలకు ఆయనే కారణమని తెగ విరుచుకుపడతారు. జగన్ ఏ మంచి చేసినా మెచ్చుకోవడానికి రాని నోళ్ళు చిన్న తప్పు జరిగినా రాద్ధాంతమే చేస్తారు. జగన్ తక్షణం రాజీనామా చేయాలంటూ గొంతు పెంచుతారు. మరి ఇదే జగన్ బయట జనాలకు మాత్రం బాగా నచ్చేస్తున్నాడు. జగన్ పాలన బాగుందని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎం లు ఆయన పధకాలను తమ ఇలాకాలో అమలు చేస్తూంటారు. ఇక పొరుగున ఉన్న తెలంగాణాలో కాంగ్రెస్ నేతలకు అయితే జగన్ అద్భుతమైన పాలన అందిస్తున్నట్లుగా లెక్క. ఇపుడు కర్నాటక నేతలు కూడా జగన్ని గొప్పగా కీర్తిస్తున్నారు. ఈ మాట అంటున్నది తెలంగాణా కాంగ్రెస్ నేతలు. ఏపీలో పరిపాలన బాగుంది. ఆయన అమలు చేస్తున్నన్ని పధకాలు తెలంగాణాలో అమలు కావడంలేదని అంటారు. కరోనా వేళ జగన్ తీసుకుంటున్న చర్యలు అదుర్స్. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చి పేదలకు న్యాయం చేస్తున్నారు అంటారు టీ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటిరెడ్డి. కేసీయార్ సంపన్నరాష్ట్రమని చెప్పుకుంటారు కానీ ఏపీ మాదిరిగా కరోనా రోగులకు ఆర్ధిక భరోసా లేదని అక్కడి విపక్షం నెత్తీ నోరూ బాదుకుంటుంది. కానీ ఆ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా ఏపీని జగన్ కావాలని సర్వనాశనం చేస్తున్నాడనే ఘాటు విమర్శలు చేస్తారు.తాజాగా జగన్ లాంటి సీఎం ఏపీకి ఉండడం అక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కర్నాటక ఎమ్మెల్యే బీజెడ్ జమీర్ అహ్మద్ కీర్తిస్తున్నారు. కరోనా వేళ జగన్ చక్కని చర్యలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున కితాబు ఇస్తున్నారు. అక్కడ పేదలకు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలోకి కరోనాను చేర్చారని చెబుతున్నారు. దేశంలో ఇలా ఏ ఒక్క రాష్ట్రమూ చేయలేదని కూడా అంటున్నారు. జగన్ని చూసి మిగిలిన రాష్ట్రాల వారు నేర్చుకోవాలని కూడా అహ్మద్ హిత బోధ చేస్తున్నారు. మరి ఒక విధంగా ఇది జగన్ కి ప్లస్ పాయింట్ గానే చూడాలి.ఏపీలో జగన్ పాలన మీద సగటు జనాలు బాగానే ఉందనే అనుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు చెప్పినట్లుగా మరీ గొప్పలకు పోకుండా అలాగనీ టీడీపీ నేతలు అన్నట్లుగా ఏపీ సర్వనాశనం అయిందని కాకుండా ఏవరేజ్ మార్క్ ని దాటే జగన్ ఏలుబడి సాగుతోంది అంటారు. అది తప్పు అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ ఏపక్ష గెలుపు అసాధ్యమనే చెప్పాలి. అంటే జగన్ మీద జనాలకు వ్యతిరేకత లేదు. మరి టీడీపీ ఎందుకలా రచ్చ చేస్తోంది అంటే అది పక్కా రాజకీయం కాబట్టి అనే చెప్పాలిక్కడ. జగన్ విషయంలో టోటల్ గా చూస్తే ఒక్క టీడీపీ ఏంటి బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేనాని అంతా కూడా వ్యతిరేకమే. అందువల్ల ఆయనకు ఇంట్లో ఈగల మోత తప్పడంలేదు. మరి ఇంట ఎపుడు గెలుస్తారు అంటే రాజకీయాల్లో జనాలను గెలిచినంత తేలిక కాదు విపక్షాలను గెలవడం. సో. జగన్ కి ఈ మోత ఎప్పటికీ తప్పదన్నది పచ్చి నిజం.

Related Posts