జగిత్యాలలో విషాదం నవ వరుడు కరోనా తో మృత్యువాత వధువు, కుటుంబం పాజిటీవ్
పెళ్లి కుదిరింది. పెళ్లి చేసుకునే విషయంలో అన్నీ దగ్గరుండి తాను చూసుకున్నాడు. ఎక్కడ ఎవరి ద్వారా కరోనా వచ్చిందో తెలియదు గాని పెళ్లి తర్వాత కరోన పరీక్షలు చేయించుకుంటే కుటుంబంలో అందరికీ కరోనా ఉన్నట్లుగా తేలింది వరుడు ప్రాణం కోల్పోయాడు . జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామానికి చెందిన చింతకుంట కృష్ణంరాజు 26 అనే నూతన వరుడు కోవిడ్ తో చికిత్స పొందుతూ మరణించాడు.రాజు కి ఇదే నెల 13 న వివాహం జరిగింది. పెళ్లి అయిన 3 రోజులకే కోవిడ్ లక్షణాలు కనిపించగ ఆయన కి టెస్టులో పాజివిట్ గా తేలింది. ఆయన తో పాటు పెళ్లి కూతురు కి సైతం పాజిటివ్ వచ్చింది. ఇంట్లో కుటుంబీకులకు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. రాజుకి శ్వాస తీసుకోవటం లో ఇబ్బందులు రాగానే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు.పెళ్లయ్యాక 13 రోజులకే మరణించటం కుటుంబం లో తీవ్ర విషాదం నింపింది.రాజు కుటుంబీకులకు కూడా కరోన వచ్చిన వారికి వ్యాధి తీవ్రత అంతగా లేదు.ఏది ఏమైనా పెళ్ళైన 3 రోజులకే ఆసుపత్రి లో చేరి మరణించటం ఇంట్లోనూ అటు గ్రామంలోను తీవ్ర విషాదం నింపింది.