YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆక్సిజన్ ఆన్ వీల్స్ ను ప్రారంభించని మంత్రి అప్పలరాజు

ఆక్సిజన్ ఆన్ వీల్స్ ను ప్రారంభించని మంత్రి అప్పలరాజు

శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్   ఆక్సిజన్ ఆన్ వీల్స్ ను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. పలాస సి.హెచ్.సిలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ఆన్ వీల్స్ ను మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఆక్సిజన్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని తూర్పు నావికాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేంద్ర బహదూర్ సింగ్ రూపకల్పన చేశారు. పి.ఎస్.ఏ ఆక్సిజన్ ప్లాంట్ ను మొబైల్ ప్లాట్ ఫామ్ కింద అనుసంధానం చేసి అవసరమగు ఆసుపత్రుల వద్ద ఆక్సిజన్ అందించే కార్యక్రమాన్ని తూర్పు నావికాదళం చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరిన మీదట తూర్పు నావికాదళం ఆక్సిజన్ ఆన్ వీల్స్ పలాస ఆస్పత్రి వద్ద సమకూర్చినది. ఈ ప్రాజెక్టును విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ నిపుణుల బృందం వచ్చి నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. ఆసుపత్రి సిబ్బందికి కూడా దీనిపై శిక్షణను కల్పించారు. కోవిడ్ భాదితులకు 24 హెచ్ ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. మూడు నెలల పాటు ఆసుపత్రి వద్ద ఈ ప్లాంట్ లభ్యంగా ఉంటుంది. ఈ మేరకు నేవీ అధికారులు ఒక ప్రకటన జారీ చేస్తూ సాధారణ ప్రజానీకానికి సహాయక చర్యల్లో నేవి ముందుంటుందని ప్రకటించారు.  డాక్టర్ అప్పలరాజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వీల్స్ ఆన్ ఆక్సిజన్ కార్యక్రమం బృహత్తరమైనదన్నారు. పలాస ఆసుపత్రులకు సుదూరం నుండి వచ్చే కోవిడ్ బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.

Related Posts