జగ్గంపేట
డిగ్రీ వరకూ చదివిన ఆ యువకుడు ఒక యువజన బ్యాంకులో ఫీల్డ్ మాన్ గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల లాక్ డౌన్ తో సరైన పని లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆ యువకుడు సులభ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక కంటైనర్ హౌస్ లో చోరీకి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో అన్నందాసు విజయ్ కుమార్ అనే వ్యక్తి తన పంట పొలంలో ఉండడానికి కంటైనర్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ హౌస్ లో ఒక ఏసీ తో పాటు,ఆయన పని చేసుకునేందుకు యాపిల్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన లాప్టాప్, ఐ ఫోన్, వాచ్, వాటర్ సప్లై చేసే మోటార్లను అమర్చారు. ఆయన వేరే పని పై బయట ఊరు వెళ్లి తిరిగి వచ్చి చూసుకునే సరికి కంటైనర్ హౌస్ లో సామాన్లు కనిపించలేదు. దీనిపై జగ్గంపేట పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ చోరీకి సంబంధించి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తన సిబ్బందితో సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టారు.
మామిడాడ గ్రామంలో ఉల్లంకుల ఆంజనేయులు అనే యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడ అనే సమాచారం జగ్గంపేట ఎస్ఐకి రావడంతో ఎస్సై తన సిబ్బందితో వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆ యువకుడు చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ఈ ఘటనపై జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లో ముద్దాయిని మీడియా ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ జగ్గంపేట మండలం మామిడాడ గ్రామం లో గత నెల 29వ తేదీన గ్రామంలోని అన్నం దాసు విజయ్ కుమార్ కంటైనర్ హౌస్ లో సామాన్లు దొంగిలించినట్లు జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తన సిబ్బందితో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేయగా మామిడాడ గ్రామానికి చెందిన ఉల్లంకుల ఆంజనేయులు (26) అనే యువకుడు 24వ తేదీ సోమవారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని ఈ చోరీ ఘటనలో అతని వద్ద నుంచి కంటైనర్ హౌస్ కి ఏర్పాటుచేసిన ఏసీ ఇన్ డోర్, అవుట్డోర్ మిషన్ తో పాటు, వాటర్ మోటార్ తో పాటు, ఆ హౌస్ లోని ఆపిల్ లాప్టాప్, ఒక సెల్ఫోన్, ఆపిల్ వాచ్ తో పాటు, ఒక బ్యాగ్ ను సుమారు రెండు లక్షల 45 వేల రూపాయలు విలువగల చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగిందని సీఐ సురేష్ బాబు తెలిపారు. ఈ చోరీ ఘటనపై జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తన సిబ్బందితో చాకచక్యంగా ప్రయత్నించి, అత్యంత టెక్నాలజీనీ ఉపయోగించి ముద్దాయిని అదుపులోకి తీసుకుని సొత్తు రికవరీ చేయడం జరిగిందని సిఐ తెలిపారు. ఈసందర్భంగా ఎస్ఐ రామకృష్ణతో పాటు సిబ్బందిని సురేష్ బాబు అభినందించారు. దీనిలో భాగంగా ఐ డి పార్టీ హెడ్ కానిస్టేబుల్ రమణ, హోంగార్డు సోమరాజు ల ను అభినందించి, నగదు రివార్డును సిఐ సురేష్ బాబు, ఎస్సై రామకృష్ణ మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో జగ్గంపేట ఏఎస్ఐ నూకరాజు, సిబ్బంది రెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.