YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీభత్సం సృష్టించిన యస్ తుఫాన్

బీభత్సం సృష్టించిన యస్  తుఫాన్

భూవనేశ్వర్
యస్ అతి తీవ్ర తుపాను ఒడిశాలోని బాలాసోర్కు సమీపంలో తీరం దాటింది.తుపాను వాయవ్య దిశగా కదులుతూ మరి కొద్ది గంటల్లో బలహీ నపడనుంది. తీరాన్ని దాటే సమయంలో ఒడిశా, పశ్చిమ్ బెంగాల్లోని తీర ప్రాంత జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. భీకరగాలులు, భారీ వర్షాలతో ఆయా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.  తుపాను ధాటికి పలుచోట్ల ఇళ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 130-155 కి.మీ వేగంతో వీచిన పెనుగాలులు ఒడిశాలోని భద్రక్ జిల్లాను అతలాకుతలం చేశాయి. ప్రచండ గాలుల ధాటికి కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరి పడ్డాయి. ఒడిశాలోని బాలేశ్వర్జిల్లా చాందీపూర్ తీరంలో సముద్రం బాగా ముందుకొ చ్చింది. ఆ ప్రాంతంలోని సుమారు 30 గ్రామాలు సముద్రపు నీటిలో చిక్కుకు న్నాయి.  తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒడిశా, బెంగాల్లో పలు ప్రాంతాలు నీట మునిగా యి. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

Related Posts