హైదరాబాద్
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఎసిబి డిపార్ట్ మెంట్ కి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకుంటూ కారులో యథేచ్ఛగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు చెకింగ్ లో పట్టుకున్నారు.. నిన్న సాయంత్రం వేళ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 105 వద్ద చెకింగ్ చేస్తున్న పోలీసులకు ఇతగాడు దొరికాడు. అతని వద్ద డూప్లికేట్ కార్డులు ఉన్నాయని సి ఐ అతని వాహనాన్ని సీజ్ చేయించారు. ఇలా ఎందరో డూప్లికేట్ కార్డులు పెట్టుకొని యధేచ్ఛగా తిరుగుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.