త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పర్యటిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం నాడు నీరు-ప్రగతిపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. ఈ కారక్యక్రమంలో జిల్లా కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలిస్తానన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆగకూడదని, హక్కుల కోసం పోరాడాలన్నారు. ఆస్పత్రుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకూడదు, దోమల ఉత్పత్తిని నిర్మూలించాలన్నారు. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం పెరగాలి. నమ్మకం పోయేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించరాదని అన్నారు. నమ్మకం, విశ్వాసాలే ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు. జల సంరక్షణ చర్యలే రాష్ట్ర పురోగతికి అక్కరకు వచ్చాయి.కేంద్రం సహకారం లేకున్నా స్వయంకృషితో ప్రగతి సాధిస్తున్నాం.ఈ కృషిని ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని అయన అన్నారు. పోలవరం ఒక భగీరథ ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్ష. పోలవరంపై ప్రజలను చైతన్యపరచాలి. ఎంతమేర పనులు జరిగాయో అవగాహన కలిగించాలి. ప్రతి జిల్లానుంచి పోలవరం డ్యామ్ సైట్ కు బస్సులు నడపాలని అన్నారు. రైతులు,విద్యార్ధులు,పాత్రికేయులకు పోలవరం పనులను చూపించాలి. 13 జిల్లాలలో 13 జల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. చెరువుల పూడికతీత,ముళ్ల కంపల నరికివేత,చెక్ డ్యాముల పనులు వేగవంతం కావాలి. పంట కాలువల్లో నీటి ప్రవాహానికి అవరోధం ఉండరాదని అయన అన్నారు. రాబోయే ఖరీఫ్ కు రైతులను సన్నద్ధం చేయాలి.సూక్ష్మ పోషకాలు,విత్తనాలు,ఎరువులు సిద్ధం చేయాలి.భూసార పరీక్షలు సమర్ధంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఈ ఏడాది రూ.10వేల కోట్ల విలువైన పనులు జరగాలి. పనులు ముమ్మరంగా జరగాలి. అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పని ప్రదేశాల వద్ద తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలి. ఎండ తీవ్రతను బట్టి ఉపాధి పనివేళలు నిర్ణయించాలని అన్నారు. దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక నమూనా రాష్ట్రం కావాలి. సెర్ప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, సెర్ప్ సమన్వయంగా పనిచేయాలని అయన అన్నారు.