YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ పై షర్మిల ఫైర్

కేసీఆర్ పై షర్మిల ఫైర్

హైదరాబాద్, మే 26, 
సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కేసీఆర్ మీది గుండెనా.. బండనా.?’’ అంటూ వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సుల విషయంపై ఆమె మాట్లాడుతూ.. గతంలోనే సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి 658 కుటుంబాల ఉసురు పోసుకోవద్దని హితవు పలికారు. ఈ మేరకు ఆమె బుధవారం ఆన్ లైన్ వేదికగా మాట్లాడారు.కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందేనంటూ షర్మిల పట్టుబట్టారు. ‘‘పేదలు పిట్టల్లా రాలుతుంటే మీకు కనిపించడం లేదా? ఆయుష్మాన్ భారత్‌లో తెల్లరేషన్ కార్డున్నవారంతా రారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలి’’ అని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కూడా తాను చేసే పనులు తెలంగాణ ప్రజలెవ్వరూ గమనించడం లేదనుకోవడం పొరబాటని అన్నారు. చికత్స కోసం యశోద ఆసుపత్రి వెళ్లిన కేసీఆర్ పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఆమె ఎద్దేవా చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతి రోజు మేము విన్నవిస్తున్నా.. దున్నపోతు మీద వాన పడ్డ చందంగా దాన్ని ఈ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. తమ ఒత్తిడి తట్టుకోలేక కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేర్చి చేతులు దులుపుకున్నారన్నారు.ఆయుష్మాన్ భారత్ వల్ల తెలంగాణలోని 26 లక్షల కుటుంబాలకే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ వల్ల 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని షర్మిల వెల్లడించారు. ఒకప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒట్టి దిక్కుమాలిన పథకం అన్న కేసీఆర్.. ఇప్పుడే అదే స్కీమ్ లో ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Posts