హైదరాబాద్, మే 27,
సామాన్యులకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే వస్తోంది. పెట్రోల్ డీజిల్ ధరల దగ్గరి నుంచి వంట నూనె వరకు చాలా వాటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరిన్ని ప్రొడక్టులు వచ్చి చేరబోతున్నాయి. రానున్న రోజుల్లో ఏసీ, ఫ్రిజ్ వంటి ధరలు పెరగనున్నాయి.మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం.. కన్సూమర్ అప్లయెన్సెస్ ధర 10 శాతం నుంచి 15 శాతం పెరగనున్నాయి. జూలై నెల నుంచి ధరలు పెరగొచ్చు. కమోడిటీ ధరలు పెరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.కంపెనీలు 2021 ఫిబ్రవరి నెలలో ప్రొడక్టుల ధరలను పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మెటల్ ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ కంపెనీల అమ్మకాలు తగ్గిపోయాయి. అదేసమయంలో ముడిపదార్థాల ధరలు మాత్రం పెరుగుతూనే వస్తున్నాయి.దీంతో వచ్చే కాలంలో ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ వంటి వాటి ధరలు పైకి కదలానున్నాయి. కమోడిటీ ధరలు పెరగడం, డిమాండ్ బలహీనంగా ఉన్నా కూడా నాలుగో త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించామని, అయితే రానున్న రోజుల్లో మాత్రం ధరల పెంపు ఉంటుందని వివరించింది.