YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

కరోనా నుంచి కోలుకున్న అమెరికా

కరోనా నుంచి కోలుకున్న అమెరికా

వాషింగ్టన్, మే 27, 
అమెరికా.. కరోనా మహమ్మారి దెబ్బకు చిగురుటాకులా వణికిన అగ్రరాజ్యం. అంబులెన్సు సైరన్లతో మారుమోగిన దేశం. వైరస్ దెబ్బకు 6 లక్షల మందిని పోగొట్టుకుని విలవిల్లాడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టీకాలతో వైరస్ ను కట్టడి చేసింది. ‘మాస్క్ మస్ట్’ అనే రూల్ ను ఎత్తేసే స్థాయిలో నిలిచింది. జనాలు హాయిగా బయట తిరుగుతున్నారు. బంధువులు తమ వారిని కలుసుకుంటున్నారు. పార్కులు ఓపెన్ అవుతున్నాయి. ఆఫీసులు తెరుచుకుంటున్నాయి. మళ్లీ మునుపటి రోజులు వస్తున్నాయి. కారుచీకట్లను దాటుకుని వచ్చిన వెలుగులను అమెరికన్లు ఇప్పుడు అనుభవిస్తున్నారు.అమెరికాలో ఇప్పటిదాకా 33,922,998 మంది కరోనా బారిన పడ్డారు. ఆరు లక్షల మందికి పైగా చనిపోయారు. అయితే అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో కొత్త కేసుల సంఖ్య తగ్గుతోంది. అమెరికాలో దాదాపు 36 రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నాయి. సోమవారం నాటికి సగటున రోజూ 25 వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఎఫెక్టివ్ గా నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్లే ఇది సాధ్యమైంది. ‘‘రానున్నవి మంచి రోజులు. రోజు వారీ కేసులు 10 వేలకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే మహమ్మారి అంతమైపోతుంది. ఇది చాలా మంచి వార్త’’ అని ప్రొఫెసర్ మోనికా గాంధీ అన్నారు.ఇప్పటిదాకా అమెరికాలో 16 కోట్ల మంది కనీసం సింగిల్ డోసు తీసుకున్నారు. 13 కోట్ల మంది ఫుల్ వ్యాక్సిన్ వేసుకున్నారు. దాదాపు సగం రాష్ట్రాల్లో సగం మందికి పైగా పెద్దలకు పూర్తిగా టీకాలు వేశారు. దేశంలోని 61 శాతం మంది పెద్దలు కనీసం సింగిల్ డోసు తీసుకున్నారు. యువకులకు వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటిదాకా ఆందోళనలు ఉండేవి. అయితే, బయోఎంటెక్ సంస్థ పిల్లలపై ఫైజర్ వ్యాక్సిన్ను పరీక్షించి చూసింది. దాదాపు 3,700 మంది చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చి చూశామని, ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రకటించింది. దీంతో తాజాగా 12 ఏండ్లు పైబడిన పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అమెరికా అనుమతిచ్చింది. ఈ వారంలో 12 లక్షల మందికి పైగా పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నారు. తొందర్లోనే పూర్తిగా వ్యాక్సినేషన్ చేసిన దేశంగా అమెరికా నిలవనుంది.

Related Posts