లాక్డౌన్ తో కొంత మేర కరోనా తగ్గు ముఖం పడుతున్నట్లు అనిపిస్తున్నా, రోజుకో వైరస్ రూపాంతరం చెందుతూ మానవాళిని కబళించుపోతోందని ఓ ప్రక్కన వినిపిస్తోంది. కరోనా నిర్మూలనకు సరైన మందులేదు, కట్టడి చేస్తుందనుకున్న వ్యాక్సిన్లూ అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో కృష్ణ పట్నం ఆనందయ్య చేస్తున్న ఆయుర్వేద వైద్యం గాలిలో కలిసిపోతున్న పాణాల్ని ఆంజనేయుడి సంజీవినీ లా కాపాడుతోందనుకుంటే, క్యాప్ట లిస్టుల కుళ్లు రాజకీయలతో అవంతరాలు సృష్టించి మందు పంపిణీ ఆగిపోయేలా చేశాయి. ఈ సందిగ్ధ వైద్యం పై పలువురు ప్రముఖలు తమ అభిప్రాయాలు తెలియచేశారు.
మన ప్రాచీన భారతీయ వైద్యవిధానం ఆయుర్వేదమే ననీ, దీని గురించి వేదాలలో ప్రత్యేక గ్రంధాల్లో నిర్ధేశించారని ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డా.గాయత్రీ దేవి, మరియు ప్రసిద్ధ యోగా గురువు అరుణాదేవి , అల్లోపతిలో అపార అనుభవంగల సుప్రసిద్ధ హృద్రోగ నిపుణులు డా.టి.వి.ఏ.ఎస్.శర్మ అంటున్నారు.
ధన్వంతరి, పతంజలి , సుశ్రుషుడు, చరకుడు వంటి అనేక మంది మహర్షులు వేల సంవత్సరాల క్రితమే ఈ దేవభూమి లో ఉండే అనేక ఔషధ గుణాలు కల్గిన వనమూలికలతో సర్వ సాధారణమైన రోగాల నుండి అత్యంత ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులను సహితం నయం చేసేవారని చరిత్ర లోఉందన్నారు. చిత్తశుద్ధి తో వారు చేసిన కృషి ఫలితమే ఈనాడు మనకు ప్రకృతి లో సులభంగా లభిస్తున్న దివ్యౌషధ విధానాలే ఈ ఆయుర్వేదం, ధన్వంతరి, యోగా . వీటి ద్వారా తరతరాలుగా కోటాను కోట్ల మంది స్వస్థత పొందుతున్నారు. ఆయుర్వేదం పరమౌషదం. వ్యక్తిలో ఉన్న రోగ లక్షణాలను బట్టి బలహీనబడ్డ నాడీ వ్యవస్థను పునరుత్తేజం చేయడానికి , ప్రకృతి ప్రసాదించిన వనమూలోకల్ని ఉపయోగించి అప్పటికప్పుడే ఆయుర్వేద మందుని ఎంతో నిష్ఠతో శ్రద్ధ గా , శుచిగా తయారు చేసి రోగికి చికిత్స చేస్తారని డా.గాయత్రీ దేవి అన్నారు.
వనమూలికా వైద్యం తో పాటు యోగాభ్యాసం,ప్రాణాయామలు, ధ్యానం, పరిమితమైన పౌష్టికాహారం , సమయ పాలన, దైవారాధన, యజ్ఞ యాగాది క్రతులు వంటివి ఆచరించాలని ఈ సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానంలో నిర్ధేశించారని యోగా గురువు అరుణాదేవి తెలియచేశారు.
కరోనా బాధితులకు చేస్తున్న చికిత్స లో భాగంగా ఇస్తున్న మందుల్లో స్టెరాయిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తులో రోగికి అనేకానేక తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అరుణాదేవి అంటున్నారు. కరోనా వైరస్ కి ఇప్పటివరకు ఖచ్చితమైన మందు ఎవ్వరూ కనుగొనలేకపోయారని, వైరస్ లక్షణాలను బట్టి వైద్య విధానంలో ఉన్న మందులతోనే రోగికి చికిత్స చేస్తున్నారు.అవి పూర్తి స్థాయిలో సత్ ఫలితాలు ఇవ్వడం లేదని నిరూపణ అవుతోంది. దీనివల్ల ఇప్పటికే లక్షలాదిమంది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైద్య విధానం లో వాడే మందుల్లో ఉండే స్టెరాయిడ్స్ వల్ల భవిష్యత్తు లో రోగి అనేకానేక రుగ్మతలకు గురైతాడాని అది అత్యంత ప్రమాదకరమని అరుణాదేవి అన్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ ల పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ ని ఆమె తెలియచేశారు.
ఈ పరిస్థితుల్లో కృష్ణ పట్నం ఆనందయ్య నిస్వార్థంగా చేస్తున్న ఆయుర్వేద వైద్యం ఎంతో సత్ఫలితాల్ని ఇస్తూ వేలాది మందిని మృత్యువాత పడకుండా రక్షిస్తుంటే దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న మెడికల్ మాఫియా , రాజకీయ వ్యవస్థను అరికట్టాలని, ప్రజలు కోరుకునే వైద్యాన్నే ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని అరుణాదేవి కోరుతున్నారు.
కృషపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుల్లో ఉపయోగించే 16 రకాల వనమూలికలు ఆయుర్వేద గ్రంధాలలో సూచించినవేనని అవి రోగి పైఎలాంటి దుష్పరిణామాలు చూపక పోయినా, వాటి తయారి విధానంలో తగిన జాగ్రత్తలు పాటించాలనీ, ముందుగా శాస్త్రీయంగా పరిశోధనలు చేశాకనే మందు తయారు చేసి, ఓ విధి విధానాలతోనే రోగికి చికిత్స చేయాలని ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డా.గాయత్రీ దేవి అంటున్నారు.
ఆనందయ్య తయారు చేస్తున్న ఈ మందుకోసం సేకరించే వనమూలికలు సారవంతమైన భూమి నుండి, సూర్యోద సమయంలోనే సేకరించి ముందుగా శుద్ధి చేసి, ఓ ప్రత్యక వాతావరణం గల ప్రదేశంలో నే సమపాళ్లలో మిశ్రమం చేసి తయారు చేయాలని డా.గాయత్రీ దేవి అన్నారు.
ప్రతి మనిషీ చిత్తశుద్ధితో సమాజం పట్ల భాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ, తమకు విధించిన వృత్తి ,వ్యాపార , ఉద్యోగాలను క్రమశిక్షణగా నిర్వహించడమే ఆరోగ్యకరమైన జీవినవిధానమని విజయవాడకు చెందిన ప్రఖ్యాత వైద్యులు డా.టి.వి.ఏ.ఎస్.శర్మ అంటున్నారు. కరోనా వైరస్ రోజుకోవిధంగా తన ఉనికిని మారుస్తూ విస్తరిస్తున్న ఈ దశల్లో.. ఆశగా శ్వాశ గా మారి ఎందరినో బ్రతికిస్తున్న ఆనందయ్య ఆయుర్వేద వైద్యం శాస్త్రీయమా....? ఆశాస్త్రీయమా అన్న చర్చలు మాని తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆనందయ్య ఇస్తున్న మందు అందరికి అందేలా చర్యలు చేపట్టాలని ప్రజల్ని కాపాడాలని డా.టి.వి.ఏ.ఎస్ శర్మ కోరుతున్నారు.
Contribution: సురేష్ కశ్యప్