న్యూఢిల్లీ మే 27
దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో ఈ ఇన్ఫెక్షన్ చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను సత్వరమే విదేశాల నుంచి తెప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ప్రపంచంలో ఈ డ్రగ్ ఎక్కడ అందుబాటులో ఉన్నా యుద్దప్రాతిపదికన తెప్పించాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. యాంఫోటెరిసిన్-బీ ను సేకరించేందుకు భారత దౌత్య కార్యాలయాలు సన్నాహలు చేపట్టాయని అమెరికాలోని గిలైడ్ సైన్సెస్ సహకారంతో ఇవి అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.భారత్ కు ఇప్‌ుటికే 1,21,000 యాంఫోటెరిసిన్-బీ వయల్స్ చేరుకోగా మరో 85,000 వయల్స్ రానున్నాయి. ఇక దేశీయంగా మందు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే మరో ఐదు కంపెనీలకు లైసెన్సులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న రోగులను బ్లాక్ ఫంగస్ ముప్పు వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 9000కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవడంతో ఇన్ఫెక్షన్ నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.