తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని టిటిడి నూతన బోర్డు సభ్యురాలు సుధా నారాయణ మూర్తి, ఎస్వీ బిసి చైర్మన్ కె రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. ఆలయం వెలుపల బోర్డు సభ్యురాలు సుధా నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ టిటిడి బోర్డు సభ్యురాలిగా ఎంపికవ్వడం అలాగే స్వామి వారికి సేవ చేసే బాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.