హైదరాబాద్, మే 27,
2 డీజీ డ్రగ్ విడుదల అయ్యింది.కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకునే విధంగా ఈ 2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ముందుగా 10వేల సాచెట్లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన విషయం తెలిసిందే. కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) . 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల..వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పొడిని తయారు చేసింది. దీనిని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని… భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.