YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డిఎంకే నేత కనిమొళితో సిఎం కేసీఆర్ భేటీ

డిఎంకే నేత కనిమొళితో సిఎం కేసీఆర్ భేటీ

చెన్నై లో రాజ్యసభ సభ్యరాలు, డి ఎం కె నాయకురాలు కనిమొళి తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. దేశ రాజకీయాలపై సుమారు గంట పాటు చర్చించారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కనిమొళి అభినందించారు. దేశ అభివృద్ధి లో రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు మరింత ఐక్యంగా పని చేయాలని ఆమె తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ కనిమొళి కి వివరించారు. త్వరలో తెలంగాణ లో చేపడుతున్న ప్రాజెక్టులన్నీసందర్శిస్తారనని కనిమొళి సీఎం కీ తెలిపారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలది ప్రముఖ పాత్ర కావాలని  అన్నారుఎ. భారత దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే సమైక్య స్ఫూర్తి ఉంటుందన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ,కాంగ్రెస్ ల కన్న ఎక్కువ సీట్లు ప్రాంతీయ పార్టీలకే సీఎం కేసీఆర్ అన్నారు.  రాజకీయాలలో గుణాత్మక మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చినట్లు చెప్పారు.  కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్,  కేకే,  మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

Related Posts