YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*కోవిడ్19 కమాండ్ కంట్రోల్*

*కోవిడ్19 కమాండ్ కంట్రోల్*

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*కోవిడ్19 కమాండ్ కంట్రోల్*
*కోవిడ్ హెల్పింగ్ హ్యాండ్స్*
***********************
కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించేందుకు ముందుకువస్తామని పౌరుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సహాయక చర్యలను సమన్వయం చేసుకోవాడానికి ఇద్దరు సీనియర్ నోడల్ అధికారులను నియమించింది. ( శ్రీ రవి చంద్ర ఐఏఎస్, డాక్టర్ అర్జా శ్రీకాంత్ 9650990016 ).
ఇప్పటి వరకు వివిధ సంస్థలు, ట్రస్టులు, సొసైటీలు, దాతలతోపాటు విదేశాల్లో ఉన్న మన తెలుగువారు, పిఎస్‌యులను సంప్రదించడం జరిగింది. మన దేశంలోని వివిధ సంస్థలు కోవిడ్19 పై పోరాడడం కోసం ఔషధాల రూపంలో గానీ, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సర్జికల్ మాస్కులు, రెస్పేరేటర్లు, మందుల పరికరాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు.  కోవిడ్ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడానికి వీలుగా అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. దీనికి ప్రజలు వ్యక్తిగతంగానూ, సంస్థల తరుఫున చేసే సాయం బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఉపయోగపడుతుంది. 
• గత 10 రోజుల్లో రూ. 6.72 కోట్ల విలువైన కోవిడ్ సంబంధిత సాయం అందింది. ఇంకా రూ. 8కోట్ల రూపాయల సహాయం అందించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి.
• దాదాపు కోటి రూపాయల విలువైన కోవిడ్ చికిత్సకు అవసరమైన మందులను బయోఫోర్, లుపిన్, ఇండియాబుల్స్ లాంటి సంస్థల నుంచి అందించడం జరిగింది.
• నిర్మాణ్ సంస్థ 13x10 చొప్పున ఐసీయూ బెడ్లును ప్రతిజిల్లాలో ఒక్కో ఏరియా ఆస్పత్రికి ఒక్కో ఐసీయూ బెడ్ యూనిట్ అందించనుంది. . రెండో విడతనూ ఇదే తరహా లో మరో 13 ఐసీయూ బెడ్లు అందించబోతోంది.
• యాక్ట్ ఫౌండేషన్ మొదటి విడతగా 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్లను 6 జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనుంది. రెండో విడతలో మిగిలినవి రెండ్ విడతలో పూర్తి చేయనుంది.
• ఇప్పటి వరకు 607 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను, 184 ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. వెయ్యికిపైగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
*ఇప్పటి వరకు అందించిన సాయం వివరాలు:*
• *ప్రపంచ ఆరోగ్య సంస్థ* (డబ్ల్యూహెచ్‌ఓ)  విశాఖపట్నంలోని కోవిడ్ కేర్ సెంటర్లకు 100 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా ఇచ్చింది. ( వీటి విలువ: రూ .55 లక్షలు). అనంతపురం జిల్లాకు కోసం మరో 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు అభ్యర్థించడం జరిగింది.
• బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ సీఈవో *రంగిశెట్టి జగదీశ్ బాబు* 25లక్షల విలువైన మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స పొందుతున్న వారికి అందించారు. వారు అందించిన మందుల్లో డాక్సీసైక్లిన్ టాబ్లెట్లు 50వేలు, ఐవర్‌మెక్టిన్ టాబ్లెట్లు 25వేలు, అజిత్రోమైసిన్ టాబ్లెట్లు 25వేలు, విటమిన్ సి, జింకోవిట్ టాబ్లెట్లు 50వేలు, ఎకోస్ప్రిన్ టాబ్లెట్లు 50వేలు ఉన్నాయి. 
• *ఇండియాబుల్స్ వారు* 75లక్షల విలువైన 20వేల కోవిడ్ హోంఐసోలేషన్ మెడికల్ కిట్లను అందజేశారు. మరో 20వేల కోవిడ్ హోంఐసోలేషన్ మెడికల్ కిట్లను అందించాలని కోరడం జరిగింది.
• *ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్* వారు 4500 ఎన్95 మాస్కులు, 10వేల సర్జికల్ మాస్కుల చొప్పున విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు అందించారు. విశాఖపట్నానికి 7 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇవ్వడం జరిగింది.
• *స్పెయిన్ కు చెందిన విన్సెంట్* ఫెర్రర్ ఫౌండేషన్ 233 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను, 144 ఆక్సిజన్ సిలిండర్లతోపాటు ఐసీయూలో వినియోగించే వైద్య సంబంధిత వస్తువులను అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు అందించడం జరిగింది.
• *అమెరికేర్ ఇండియా ఫౌండేషన్* రూ. 50లక్షల విలువైన 100 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఏరియా ఆస్పత్రి కృష్ణా, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయగనరం జిల్లాలకు ఇచ్చారు.
*• ఫ్లెక్స్ ఇండియా వారు రూ.* 30లక్షల విలువైన 60 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను 30 చొప్పున కృష్ణా, చిత్తూరు జిల్లాలకు అందించారు.
• *మన తెలుగు అసోసియేషన్* ఇ.వి జర్మనీ (మాటా) రూ. 5లక్షల విలువైన 10 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను గుంటూరు జిల్లా బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించింది.
• *మ్యాక్స్ సంస్థ రూ. 13లక్షల* విలువైన 7 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు బీమవరం, 12 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను రాజోలు, 7ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను తిరుపతికి అందించింది.
• *వైజాగ్ కు చెందిన హోమిబాబా* క్యాన్సర్ ఆస్పత్రి రూ.10 లక్షల విలువైన 10 ఆక్సిజన్  కాన్సన్‌ట్రేటర్లను, 10 ఆక్సిజన్ సిలిండర్లు పశ్చిమగోదావరి జిల్లాకు ఇవ్వడం జరిగింది.
*• సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్* రూ. 2.5లక్షల విలువైన 5 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల చొప్పున విశాఖలోని కేజీహెచ్ మరియు చెస్ట్ ఆస్పత్రులకు అందించింది.
• అమెరికాలోని ఇలినాయిస్ కు చెందిన *ఎస్ఐహెచ్ ఫౌండేషన్* రూ. 25లక్షల విలువైన 51 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను విశాఖపట్నం జిల్లాకు అందించింది.
•  *ప్రాజెక్ట్ మన్వర్ డి ఏపీ టు* డాక్టర్ ఫర్ యు 3 క్రయోజనిక్ ఆక్సిజన్ సిలిండర్లను కృష్ణా జిల్లాకు అందించింది.
• శ్రీ అప్పారావు వడ్డాది రూ. 20వేలను తూర్పు గోదావరి జిల్లాకి అందించారు.
• శ్రీ శాలీమ్ గుంటూరు జిల్లాలో కోవిడ్ చికిత్ప పొందుతున్న ఇద్దరు పేషెంట్లకు అయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చారు.
• *లుపిన్ లిమిటెడ్ రూ. 5లక్షల* విలువైన డెక్సామెథసోన్ 4ఎంజి 15లక్షల ట్యాబ్లెట్లు ప్రభుత్వానికి అందించింది.
*ఇప్పటివరకు అందుకున్న సహాయ మొత్తం వివరాలు:*
రూ. కోటి విలువైన మందులు మరియు రూ. 5.72 కోట్ల విలువైన వైద్య పరికరాలు (ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఐసియు బెడ్లు, మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు తదితరాలు) మొత్తంగా రూ. 6.72 కోట్లు సహాయం పొందడం జరిగింది.
*సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నవారు:*
• *ఖల్సా ఎయిడ్ ఇండియా* ఛారిటబుల్ ట్రస్ట్ రూ. 12.5లక్షల విలువైన 25 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించనుంది. ఇవి పశ్చిమగోదావరి జిల్లాలో వినియోగించుకోవాలని కోరారు.
• *సౌత్ ఇండియన్ సిమెంట్* మ్యానుఫ్యాశ్చురర్స్ అసోసియేషన్ (ఎస్ఐసిఎంఎ) రూ. కోటి విలువైన 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇచ్చేందుకు అంగీకరించింది.
• *లిండే ఇండియా లిమిటెడ్ రూ.* 10లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అనంతపురం జిల్లాకు అందించనుంది.
• *ఫ్లెక్స్ చెన్నై రూ. కోటి విలువైన* 60, 50 లీటర్ల, 70, 4 లీటర్ల మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్ సిలిండర్లు మరియు 170, 10 లీటర్ల స్టీల్ సిలిండర్లు ఇవ్వనుంది.
• *మన తెలుగు అసోసియేషన్* ఇ.వి జర్మనీ (మాటా) రూ. 2.5 లక్షల విలువైన 5 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇవ్వనుంది.
• *డాక్టర్ నాగేశ్వర్ బండ్ల రూ.* 5లక్షల విలువైన 10 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇవ్వడానికి అంగీకరించారు.
*• గ్రీన్ ప్యానల్ రూ* . 12.5లక్షల  విలువైన 25 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అనంతపురం జిల్లాకు ఇవ్వనుంది.
• *స్వస్త్ డిజిటల్ హెల్త్ ఫౌండేషన్ &* యాక్ట్ (ఏసీటీ) సంయుక్తంగా రూ. 5 కోట్ల విలువైన 1000 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు ఇవ్వనుంది.
• *ఆదిత్య బిర్లా వారు* రూ. 50లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు మరియు పీఎస్ఐ ప్లాంట్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
*సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి మొత్తం:*
• దాదాపు రూ. 8కోట్ల విలువైన మెడికల్ ఎక్విప్‌మెంట్ అందించడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.
కరోనా మహమ్మారి పై యుద్ధం లో మేము సైతం అంటూ ముందుకొచ్చిన వీరందరూ ఎంతైనా అభినందనీయులు. వారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక ధన్యవాదములు.
*****************************
*డాక్టర్ ఆర్జ  శ్రీకాంత్*
ఏపీ స్టేట్ కోవిడ్ నోడల్ ఆఫీసర్

Related Posts