YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజకీయాలకు సీకే బాబు గుడ్ బై

రాజకీయాలకు సీకే బాబు గుడ్ బై

తిరుపతి, మే 28,
చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయం చేసి ఇప్పుడు అస్త్రసన్యాసం చేశారు సీకే బాబు. సీకే బాబు పూర్తి పేరు సీకే జయచంద్రారెడ్డి, ఆయన అభిమానులు ఆయనకు పెట్టుకున్న ముద్దుపేరు చిత్తూరు టైగర్. ఇప్పుడు పూర్తిగా తాను రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడిని రాజకీయ అరంగేట్రం చేయించాలని సీకే బాబు చూస్తున్నారట. ఆయన కుమారుడు సాయి కృష్ణను వైసీపీలోకి పంపాలని సీకేబాబు ప్రయత్నిస్తున్నారు.సీకేబాబు చిత్తూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు. మాస్ ఓటర్ల అభిమానం కలగిన సీకేబాబు 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1994, 1999, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన సీకేబాబుకు ఇప్పుడు గడ్డు రోజులొచ్చాయి. పదేళ్ల నుంచి ఆయనకు రాజకీయాలు కలసి రావడం లేదు.సీకే బాబు తన పట్టు కోల్పోకూడదన్న తపనతో అన్ని పార్టీలూ మారారు. తొలుత బీజేపీలో చేరారు. అక్కడి నుంచి టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు కూడా సీకే బాబును సాదరంగా ఆహ్వానించి గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను అప్పగించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత సీకే బాబు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ముఖ్య అనుచరుల సమావేశంలో సీకేబాబు వెల్లడించినట్లు తెలిసింది. సీకే బాబు కుటుంబ సభ్యుల నుంచి కూడా వత్తిడిని ఎదుర్కొంటున్నారు. సీకేబాబు భార్య లావణ్య కు కూడా రాజకీయాలంటే మక్కువే. అందుకే ఆమె వైసీపీలోకి వెళ్లాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. కుమారుడు సాయికృష్ణను వైసీపీలోకి పంపి తాము ఇక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని సీకే బాబు కుటుంబం నిర్ణయించుకుంది. మరి సీకే బాబు కుమారుడు ఎంట్రీకి జగన్ అవకాశమిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts