త్యేకహోదా కోసం తాను చేసింది తప్పు అని ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాత చంద్రబాబు ధర్మపోరాటం, దీక్షలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటిరాంబాబు డిమాండ్ చేసారు. చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిని జైలులో పెట్టించడం వంచన కాదా అని ప్రశ్నించారు. తాను ప్రజలకు నాలుగేళ్లుగా చేసిన వంచనకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్ష చేయడం మరోవంచనగా అబివర్ణించారు. నీతికి నిజాయితికి మారుపేరని నిప్పులాంటివారని చంద్రబాబు చెబుతుంటారు.కాని నేడు తనను జైలులో వేస్తారేమోనని భయపడిపోతున్నారు. అన్యాయంగా అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకున్నపుడు, కుట్రలు చేసినపుడు జైలుకెళ్లకతప్పదు. నీవంటి వారిని జైలులో పెడతారనేది బహిరంగరహస్యమని అయన అన్నారు.
బిజేపి, టిడిపిలు కలసి చేసిన మోసాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వహబోతున్న తరుణంలో నరేంద్రమోది తనను మోసం చేసారని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని తెలిపారు. తాజాగా జగన్ బిజేపి కలిసి పోతున్నారంటూ తన మీడియా సంస్దలతో, టిడిపి నేతలతో దుష్ప్రచారం సాగిస్తున్నారనారని అయన ఆరోపించారు. సోనియాగాంది తన మాట వినలేదని అక్రమంగా కేసులు పెట్టినా 16 మాసాలు జైలులో పెట్టినా వాటిని ఎదుర్కొన్న ధీరుడు జగన్. చంద్రబాబులా పిరికిపందకాదు మా నాయకుడని అన్నారు. ప్రజల ఆశిస్సులు మాకున్నాయి. నరేంద్రమోది, చంద్రబాబు మెడలు వంచి ప్రజలు కోరుకుంటున్నది సాధిస్తామన్నారు. మా ఎంపిలు ఐదుగురు ఉన్నా రాష్ట్రానికి హోదా సాధనకోసం తమ పదవులకు రాజీనామాలు చేసి నిరాహారదీక్షలు చేసిన ధీరులని అన్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలుచేయించకుండా వారితో తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం లాబీయింగ్ చేస్తూ వంచన చేస్తున్నారని విమర్శించారు.