YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెండు వంతెనలకు నిధులు మంజూరు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎంపి బాలశౌరి

రెండు వంతెనలకు నిధులు మంజూరు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎంపి బాలశౌరి

విజయవాడ
భీమవరం, మచిలీపట్నం రైల్వేట్రాక్ల పై పామర్రు, భీమవరం రహదారులపై వంతెనలు లేకపోవడంతో గుడివాడ వాసులు పడుతున్న వెతలు ఇకపై తీరనున్నాయి. గుడివాడ-మచిలీపట్నం రైల్వేట్రాక్వద్ద పైవంతెన నిర్మాణానికి 75కోట్లు మంజూరయ్యా యని ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. లెవెల్ క్రాసింగ్-52 వద్ద భీమవరం-విజయవాడ రైల్వేట్రాక్ పై ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.125 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. రెండు వంతెనల డిజైన్లు తయారు చేసి నేషనల్ హైవే అధికారులకు పంపు తామని అన్నారు. రెండు వంతెనల నిర్మాణానికి సహకరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. నాలుగునెలల్లో వంతెనల నిర్మాణపనులు ప్రారంభిస్తామని ఎంపీ బాలశౌరి చెప్పారు. పామర్రు నుంచి ముదినేపల్లి మీదుగా కైకలూరు వెళ్లే రోడ్డుకు భూసేకరణ జరుగుతోందని, కొత్తగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పామర్రు నుంచి ముదినేపల్లి మీదుగా కైకలూరు వెళ్లే రోడ్డు నిర్మాణానికి భూసేకరణ జరుగుతోం దని చెప్పారు. దానికితోడు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం టెండర్లు కూడా పిలిచిందని వివరించారు. గుడివాడ పామర్రు రహదారిపై ఉన్న భీమవరం, మచిలీపట్నం రైల్వేట్రాక్ లు గుడివాడ పట్టణ పరిధిలోనే ఉన్నాయన్నారు. రైల్వే ట్రాక్ లపై పై వంతెనల నిర్మాణానికి ఎంపీ బాలశౌరి పార్లమెంట్లో బయట కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆయా శాఖల అధికారులతో చర్చించి ఒప్పించారని మంత్రి కొడాలి నాని అన్నారు.  వైసీపీ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.  

Related Posts