YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

53 శాతం పూర్తయిన పోలవరం పనులు : సీఎం చంద్రబాబు

53 శాతం పూర్తయిన పోలవరం పనులు : సీఎం చంద్రబాబు

ఇప్పటివరకు మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53.02% పూర్తయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 89.44% పూర్తయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షించిన చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు 89.44 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు 59.16 శాతం పనులు జరిగాయన్నారు. స్పిల్వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ వర్క్ పనులు 72.30 శాతం, స్పిల్వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16.40 శాతం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 85.10 శాతం మేర పూర్తయ్యాయని పేర్కొన్నారు. జెట్ గ్రౌటింగ్ పనులు 64.90 శాతం , రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. తొలిసారి ఒక నెలలో లక్ష క్యూబిక్ మీటర్లు దాటిన స్పిల్వే కాంక్రీట్ పనులు జరిగాయన్నారు. ఈ నెలలో 1,15,658 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్వే కాంక్రీట్ పనులు జరిగాయని తెలిపారు. మే, జూన్ నెలల్లో వీలైనంత వేగంగా పోలవరం ఎర్త్వర్క్, కాంక్రీట్ పనులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. డ్రోన్ కెమేరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ముఖ్యమంత్రి పరిశీలించారు. 

Related Posts