YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సమసిపోని వివాదం

సమసిపోని వివాదం

హనుమాన్ జన్మస్థలం పై వివాదం రాజుకుంది. ఇప్పటికే కిష్కిందకు చెందిన ట్రస్ట్ బోర్డు సభ్యులు అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో టిటిడి తరపున ఉన్న బోర్డు సభ్యులు ఎదురుదాడికి దిగారు. కిస్కింద ట్రస్ట్ బోర్డు సభ్యులు గోవిందానంద సరస్వతి మీడియా ముందు టిటిడి పైన టిటిడి నియమించిన కమిటీ పైన తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంటనే గోవిందానంద సరస్వతి స్వామి వ్యవహారంపై  టిటిడి ఉన్నతాధికారులు ఆదేశాలతో... హనుమాన్ కమిటీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన టిటిడి హనుమాన్ కమిటీ సభ్యులు... కిస్కింద కమిటీ సభ్యులైమ గోవిందానంద సరస్వతి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్వామిజీ టిటిడి కమిటీకి రాసిన లేఖలో వ్రాసిన పదజాలం పామర్లు సైతం ఉపయోగించరని ఆరోపించారు. సన్యాసి అయివుండి ఇలాంటి పదజాలం వాడటం సరైన తీరు కాదని, శాస్త్రాల అనుగుణంగా వేసిన ఏ ప్రశ్నలకూ  కిస్కింద సభ్యులు గోవిందానంద స్వామి సమాదనం ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు. మా‌ కమిటీ అనేక ప్రమాణాలు, శాస్త్రాలు, పురాణాలు ఆధారంగా తిరుమల హనుమాన్ జన్మస్థలం అంటూ నిర్థారించిందని, అభ్యంతరాలు వుండటంలో తప్పు లేదు, కానీ సన్యాసి అయివుండి అసభ్య పదజాలం వాడటం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిటిడి కమిటీ ప్రకటనను అవాస్తవం అనడానికి అతని వద్ద ఆధారాలు ఏమి లేవని, శాస్త్రీయ చర్చలో జరిగిన వాదోపవాదాలకు గోవిందానంద సరస్వతి సమాధానం చెప్పలేక పోయాని.. పైగా బయటకు వెళ్లి మీడియా ముందు తమపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకి రామాయణంలో హనుమాన్ జన్మ తది పై మూడు సార్లు ప్రస్తావన వుందని, రామయాణంలో ఎక్కడా కూడా హనుమాన్ జన్మస్థలం ఫలానా ప్రాంతం అని లేదని అన్నారు కమిటీ సభ్యులు. స్కంధ, వరాహ ఇతర మరికొన్ని పురాణాలలో అంజనాద్రి అని ప్రస్తావన వుందని, గోవిందానంద సరస్వతి వితండవాదం మాత్రమే చేస్తూ... అందరినీ గందరగోళం లోకి నెట్టుతున్నారని వాపొతున్నారు. గతంలో ఇదే వ్యక్తి సాయిబాబా దేవుడే కాదు, షిర్డీ దేవాలయం కూల్చి వేయాలి అని మాట్లాడాడని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి సన్యాసిగా ఎలా వున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు హనుమాన్ కమిటీ. చారిత్రక, ప్రాచీన, వాస్తవ పరిస్థితులు అన్నీ పరిగణలోకి తీసుకునే హనుమంతుడు తిరుమలలోని పుట్టినట్లు తాము నిర్థారించినట్టు పేర్కొంటున్నారు.

Related Posts