YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ట్రిబ్యునల్స్ జడ్జిమెంట్‌కు బ్రేకులు

ట్రిబ్యునల్స్ జడ్జిమెంట్‌కు బ్రేకులు

హైదరాబాద్, మే 29, 
రాష్ట్రంలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ జడ్జిమెంట్‌కు బ్రేకులు వేసినట్లే కనిపిస్తోంది. రవాణా సదుపాయం నిలిచింది. కాలుదీసి కాలు బయట పెట్టొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కానీ కొందరు కలెక్టర్లు మాత్రం అత్యుత్సాహంతో ట్రిబ్యునల్కేసుల్లో వాదనలు వింటున్నారు. నిజామాబాద్ఉమ్మడి జిల్లాలోని ఓ కలెక్టర్తన రూటే సెపరేట్అంటున్నారు. లాక్డౌన్కాలంలో దరఖాస్తుదారులు, వారి తరఫున న్యాయవాదులు ఆన్లైన్లో తమ వాదనలను వినిపించాల్సిందేనంటున్నారు. ఐతే ఆర్వోఆర్ కేసుల్లో చాలా మంది వాదనలు వినిపించేందుకు న్యాయవాదులనే నియమించుకోలేదు. ఆ విషయాన్ని అర్ధం చేసుకోని సదరు కలెక్టర్మాత్రం ఆ విషయం నాకు తెలియదు.. మీ న్యాయవాది ద్వారా వాదనలను వినిపించండి. లేదంటే కేసు అంతేనంటూ హెచ్చరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.నిజానికి జూమ్యాప్లో కలెక్టరేట్నుంచి వచ్చే మీటింగ్లింక్ను ఓపెన్చేసి సమయానికి వాదనలను వినిపించే స్థోమత దరఖాస్తుదారుల్లో ఎంత మందికి ఉందో ఆ కలెక్టరే నిర్దారించుకోవాలి. అలాగే న్యాయవాదుల్లోనూ ఆన్లైన్లో జాయినైన పకడ్బందీగా వాదనలను వినిపించేగల నేర్పు కలిగిన వారి సంఖ్య ఎంత ఉంటుందో కూడా సంశయంగానే మారింది. భూమి హక్కులు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, తాము వాదనలను వినిపించుకోలేకపోతే ఏకపక్షంగా తీర్పు వెలువడితే అన్యాయమై పోతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే తీరున కొందరు కలెక్టర్లు కొన్ని ప్రత్యేక కేసుల్లో తీర్పులను వెలువరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్యుల కేసుల్లో మాత్రం నెల కిందటే వాదనలు పూర్తయ్యాయి. జడ్జిమెంట్ ఇవ్వకుండా కరోనా, లాక్డౌన్అంటూ పేచీ పెట్టారు. తీర్పు కాపీల కోసం ఎంతో మంది బాధితులు ఎదురుచూస్తున్నారు. రెవెన్యూ శాఖలో మిగతా పనులన్నీ సాఫీగానే సాగుతున్నాయి. కానీ ఆర్వోఆర్ కేసులను పరిష్కరించేందుకు మాత్రం అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. రెవెన్యూ ట్రిబ్యునల్తరఫున త్వరితగతిన కేసుల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకోవడం కంటే ఎన్ని కేసుల్లో సరైన పరిష్కారాన్ని అందించారన్నది ప్రధానంగా ఉండాలని రెవెన్యూ చట్టాల నిపుణులు, నల్సార్యూనివర్సిటీ ప్రొ.ఎం.సునీల్కుమార్అభిప్రాయపడ్డారు. ఇది అందరికీ కష్టం కాలం. ఈ సమయంలో ఆన్లైన్‌లో వాదనలంటూ కొందరు కలెక్టర్లు చేస్తోన్న హడావిడి వల్ల నిజమైన హక్కుదారులకు న్యాయం అందకపోవచ్చునన్నారు. బాధితుల పక్షాన ఐఏఎస్అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వం ప్రమేయం లేనప్పుడు ప్రయివేటు భూముల పరిష్కారంలో అధికారులు తొందర పడుతుండడం అనుమానాలకు దారి తీస్తోంది. కరోనా వైరస్వ్యాప్తి విజృంభిస్తోన్న క్రమంలో స్పెషల్రెవెన్యూ ట్రిబ్యునల్కేసుల వాదనలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు త్వరగా కేసులను క్లోజ్చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ప్రభుత్వ పెద్దల నుంచి ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయని సమాచారం. ఓ సారి రెవెన్యూ ట్రిబ్యునల్కేసుల పరిష్కార విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మళ్లీ అదే తప్పులు చేయడంలో ఆంతర్యమేమిటో అర్ధం కావడం లేదని, వాస్తవ పరిస్థితిని సీఎం కేసీఆర్దృష్టికి తీసుకెళ్లడం లేదని ఓ సీనియర్న్యాయవాది అన్నారు. ఇరుపక్షాలకు సరిపడా సమయం, నోటీసులు జారీ చేయడం, వాదనలు వినడం, అప్పీలుకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా ఇచ్చే ఏ ఆదేశాలైనా చెల్లుబాటు కావన్న ప్రాథమిక న్యాయ సూత్రాలను కలెక్టర్లు గుర్తించాలంటున్నారు. కొందరు కలెక్టర్లు పాత తీర్పు కాపీలను అందించకుండానే తేదీలు ఖరారు చేసినట్లు సమాచారం.ఆర్డర్లపై అభ్యంతరాలు తెలియజేయాలంటే వాటిని స్టడీ చేయాలి. కానీ ఆ కాపీలేవీ సర్క్యులేట్చేయకుండానే మళ్లీ వాదనలంటూ తొందర పెట్టడం సమంజసం కాదంటున్నారు. గతంలో భూ సంబంధ కేసుల్లో ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఇరుపక్షాల వాదనలు వినకుండానే కొన్ని కేసుల్లో కేవలం రికార్డులను పరిశీలించి ఆర్డర్లు జారీ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16,296 కేసులకు గాను రెండింటిని మాత్రమే పెండింగులో ఉంచారు. ఇందులో 1,851 కేసుల్లో మాత్రమే ఇరుపక్షాల వాదనలు విన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కేసుల్లో సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా తీర్పులు ఇచ్చారన్న అభియోగంపై హైకోర్టు పలు సూచనలు చేసింది. ఇరుపక్షాలకు వాదనలు వినిపించే అవకాశాన్ని కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఉత్తర్వులను అంగీకరించని ఏదైనా పార్టీ, వ్యక్తిగత విచారణ కోసం మార్చి 18వ తేదీ తర్వాత షెడ్యూల్ను ప్రకటించారు. కానీ కరోనా వైరస్వ్యాప్తి, లాక్డౌన్విధింపులతో దరఖాస్తుదారులు ప్రత్యక్ష్యంగా హాజరు కావడం అసాధ్యంగా మారింది. ఈ క్రమంలోనే కొందరు కలెక్టర్లు బాధితుల స్థితిగతులను పట్టించుకోకుండా, కేసు పూర్వాపరాలను ఆలోచించకుండా ఆన్లైన్లో వాదనలను వింటామంటూ కొత్త తరహా విధానానికి తెర తీశారు.రెవెన్యూ ట్రిబ్యునళ్లలో పెండింగులో ఉన్న 16 వేల కేసుల్లో సగానికి పైగా కేసుల్లో వాదనలు పూర్తయ్యాయి. ఐతే లాక్డౌన్, కరోనా వ్యాప్తి పేరిట కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే ఆర్డర్లు జారీ చేస్తున్నారని తెలిసింది. కానీ అన్నింటికీ ఆర్డర్లు ఇవ్వడం ద్వారానే రానున్న రోజుల్లో బాధితులకు హక్కులు పొందుతారు. ఇప్పటికే ఈ కేసుల్లోని చాలా వరకు భూములపై క్రయ విక్రయాలు పెండింగులో ఉన్నాయి. ఈ ఆర్డర్లు జారీ కావడం ద్వారా లావాదేవీల సంఖ్య కూడా అదేతీరున పెరుగుతుందని రియల్ఎస్టేట్వర్గాలు చెబుతున్నాయి. ఐతే వాదనలను మొదలుపెట్టని వాటిపై లాక్డౌన్తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం నెలకొంది. ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష్యంగానో, ఆన్లైన్లోనో వాదనలను వినిపించేందుకు బాధితులు సిద్ధంగా లేరు. కనుక కొంత కాలం పెండింగులో పెట్టడం ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అదే ఆన్లైన్లోకి రావాల్సిందేనని ఒత్తిడి చేస్తే సామాన్యులు, చిన్న చిన్న కేసులకు న్యాయవాదులను నియమించుకోవాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికే నష్టపోయిన బాధితులపై ఆర్ధిక భారం పడుతుంది.

Related Posts