నందిగామ
నందిగామ కంచికచర్ల ఆధార్ సెంటర్లకు మహిళు పోటెత్తారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో ఆధార్ సెంటర్ నిర్వాహకులు చేతులెత్తేసారు. చేయూత పథకం కోసం ఆధార్ సెంటర్ వద్ద మహిళలు బారులు తీరారు. చేయూత పథకం కోసం చేసిన ప్రభుత్వం ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ తప్పనిసరి చేసింది. మహిళలు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో ఆధార్ నిర్వహకులు బెంబేలెత్తిపోతున్నారు. చేయూత పథకం లబ్ధి పొందేందుకు వందల సంఖ్యలో మహిళలు ఆధార్ సెంటర్ కు చేరుకున్నారు. మూడు రోజులుగా స్థానిక పోలీసుల సహాయంతో ఆధార్ సెంటర్ నిర్వహించారు. సర్వర్ సరిగా పనిచేయడం లేదని కరోనా నేపథ్యంలో మూసి వేస్తున్నామని బోర్డు తగిలించారు. నందిగామ ఆధార్ సెంటర్ నిర్వాహకులు. దాంతో, అర్ధరాత్రి నుండి ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు గాసిన మహిళలు నిరాశగా వెనుదిరిగారు.