YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

సచివాలయానికి కూడా రాలేని వాడు ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాడట బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ ఏద్దేవా

 సచివాలయానికి కూడా రాలేని వాడు ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాడట          బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  డాక్టర్ కె లక్ష్మన్ ఏద్దేవా

ప్రజా సంక్షేమం, పేదల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ చరిస్మా పల్లెపల్లెలోవిస్తరిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు.మోదీ ప్రధాని అయ్యే నాటికి దేశంలో 40 శాతం జనాభాకు కనీసం మరుగుదొడ్లు కూడాలేవని, మోదీ ప్రధాని అయ్యాక.. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రతి ఇంటికి 12 వేల రూపాయాలు ఇస్తున్నారన్నారు.  మహిళల ఆత్మగౌరవంతో ముడిపడిఉన్నమరుగుదొడ్లను నిర్మించి వాటికి ఆత్మగౌరవాలయాలుగా నామకరణం చేసిన ఘనత మోదీకే దక్కుతుందని,  దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టాయిలెట్లు నిర్మించిబాలికలు మధ్యలోనే బడి మానివేయకుండా చర్యలు తీసుకున్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలో భాగంగా జీరో బ్యాలెన్స్తో అందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించిన ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు. జన్ధన్ పథకంలో భాగంగా 32 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారని,  మోదీ పాలనలో దళారుల బెడద లేకుండా చేశారని  డాక్టర్ లక్ష్మన్ అన్నారు. సురక్ష బీమా యోజన కిందఏడాదికి 12 రూపాయలు చెల్లిస్తే.. కుటుంబంలో అనుకోని ఘటన జరిగినప్పుడు కేంద్రం 2 లక్షలు, అలగే జీవన జ్యోతి పథకంలో భాగంగా మరో 2 లక్షలు కేంద్రం చెల్లిస్తుందని డాక్టర్లక్ష్మన్ తెలిపారు. ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో- బేటీ పడావో, ప్రధాని సురక్ష బీమా యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తూ.. పేదల అభివృద్ధికిమోదీ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తుందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. దళిత యువతీ యువకులు పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మోదీ ప్రభుత్వం స్టాండప్ఇండియా  ద్వారా రుణాలు ఇస్తుందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.  ఈ పథకంలో భాగంగా 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు దోహదంచేస్తున్నారని, తెలంగాణలో 4 వేలకు పైగా యువత పారిశ్రామిక వేత్తలుగా తయారయ్యారన్నారు.

పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రధాని నరేంద్రమోదీ పేదల అభ్యున్నతికి తీవ్ర కృషి చేస్తున్నారన్నారు. తన తల్లి కట్టెల పొయ్యితో వంట చేస్తూ పడ్డ కష్టాలు చూసిన మోదీ.. దేశంతో ఏతల్లి కంట కన్నీరు రాకూడదన్న ఉద్దేశంతో.. 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారన్నారు. తెలంగాణలో 20 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించామని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.

దాదాపు 60 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో...అవినీతి, అక్రమాలు తీవ్రంగా పెరిగిపోయాయని, దీంతో పేద వర్గాలు మరింత పేదలుగా, ఉన్నత వర్గాలు మరింతఉన్నతంగా మారారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. కుటుంబ పాలనతో కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టు పట్టించిందన్నారు.

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు... తెలంగాణలో ప్రజల సమస్యలను పరిష్కరించలేని కేసీఆర్..ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాననడం, థర్డ్ ఫ్రంట్ పెట్టి దేశాన్ని పాలిస్తాననడంహస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఏమీ చేయలేని కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి దేశానికి ఏం చేస్తారని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు. సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రిఢిల్లీ వెళ్తామనండం నిజంగా విడ్డూరంగా ఉందన్నారు.

దేశాన్ని రెండు పార్టీలే పాలించాలా ..? అన్న కేసీఆర్ అంటున్నారని, కానీ తెలంగాణలో కేవలం ఒకే కుటంబ సభ్యులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ ఎద్దేవా చేశారు.

మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, బిజెపి వైపు ఆకర్షితులై దేశంలో 21 రాష్ట్రాల్లో బిజెపిని అధికారంలోకితీసుకొచ్చారన్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు మోదీ చరిస్మా పెరిగిపోతుందని, తెలంగాణలోబిజెపి రోజురోజుకు బలోపేతం అవుతుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, కార్మికులు, కర్షకులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు .. ఇలా అన్ని వర్గాల ప్రజలుబిజెపి వైపు ఆకర్షితులవుతున్నారని, తెలంగాణలో బిజెపి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని డాక్టర్ లక్ష్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts