YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రతి గ్రామంలోనూ ఇంటర్నెట్ పార్క్

ప్రతి గ్రామంలోనూ ఇంటర్నెట్ పార్క్

విజయవాడ
రెండు సంవత్సరాల జగన్ పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. ఆరోగ్య పరిరక్షణకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ను అప్పులతో వదిలేసారరి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, గౌతం రెడ్డి అన్నారు. అప్పుల ఊబి లోంచీ ఏపీఎస్ఎఫ్ఎల్ ను బయటకు తీసుకొచ్చేలా ప్రణాళికలు చేసారు. ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ తెచ్చి 300 కోట్ల ఆదాయాన్ని చేకూర్చుకున్నాం. నూతన విధానం ద్వారా ఆంధ్రా యూనివర్సిటీ లోని ఆఫీసును అప్ గ్రేడ్ చేస్తున్నామని అయన అన్నారు.
ఆర్బీకె లు అన్నిటికి మటర్నెట్ ఇవ్వడం జరుగుతోంది. 8606 కనెక్షన్లు రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నాం. ఏపీఎస్ఎఫ్ఎల్ లైన్లను ఎయిర్ టెల్ కు లీజుకు ఇవ్వడం వల్ల 7 కోట్ల ఆదాయం ప్రతీ సంవత్సరం వస్తోంది. 2678 కోట్లు ఏపిఎస్ఎఫ్ఎల్ కు రావాల్సి ఉంది. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఇప్పుడు ఉన్న దగ్గర నుంచీ అండర్ గ్రౌండ్ వైరింగ్ చేస్తాం. ప్రతీ గ్రామంలో ఇంటర్నెట్ పార్కు ఏర్పాటు చేయబోతున్నాం. 13జిల్లాలలో 670 మండలాలలో 11274 గ్రామాలకు ఈ ఆప్టికల్ ఫైబర్ ను తీసుకెళతాం. విజయవాడ, విశాఖ, కడప లలో ఒక పైలట్ ప్రాజెక్టు ద్వారా 15ఎంబీపీఎస్ అన్ లిమిటెడ్  147 రూపాయలకు,  80 ఎంబిపిఎస్ 360 రూపాయలకు ఇవ్వబోతున్నాం. ఏపీఎస్ఎఫ్ఎల్ లో అవకతవకలలో లెక్కకు మించిన మానవ వనరులు ఏర్పాటు చేసారు. అధికంగా ఉన్న వారిని విధుల నుంచీ తప్పిస్తున్నాం. ట్రిపుల్ ప్లే బాక్సుల ద్వారా నెట్ అందించడం జరుగుతుంది. జగన్ పరిపాలన రెండు సంవత్సరాలలో ఎన్నికల మేనిఫెస్టో లోని అన్ని విషయాలు అమలు చేసారు. గ్రామ స్వరాజ్యంలో భాగంగా వాలంటీర్ వ్యవస్ధ, గ్రామ సచివాలయాలు ప్రారంభించారు. వేటకు వెళ్ళలేని మత్స్యకారులకు 10వేల చొప్పున చేయూతనిచ్చారు. చంద్రబాబు అవివేకంగా గాజు అద్దాలలో కూచుని మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు విమర్శలకే పరిమితం అయ్యారు. సీఎం జగన్ పరిపాలన పై ఎక్కడైనా చర్చకు మేం సిద్ధమని అయన అన్నారు.

Related Posts