YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశంలో 13 ఏళ్లకే సెక్సు గురించి పెరుగుతున్నఅవగాహన

దేశంలో 13 ఏళ్లకే సెక్సు గురించి పెరుగుతున్నఅవగాహన

దేశంలో 13 ఏళ్లకే సెక్సు గురించి పెరుగుతున్నఅవగాహన  యూత్ కు సెక్సుఅంటే పోర్న్ అనే అపోహ విటమిన్ స్ట్రీ అనే సంస్థ సర్వే లో వెల్లడి.
సెక్సు గురించి ఓపెన్ గా మాట్లాడే విషయంలో దేశంలో ఇప్పటికి బిడియం.. మొహమాటం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. మాటలు తక్కువే అయినా చేతల విషయానికి వస్తే మాత్రం షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన లెక్చరర్ ఒకరు సోషల్ మీడియాలో సంచలన సర్వే వివరాల్ని వెల్లడించారు. దేశంలోని యువత.. వారి సెక్సు అలవాట్ల గురించి వెల్లడించిన వైనం ఆసక్తికరంగా మారింది. విటమిన్ స్ట్రీ అనే సంస్థ వెల్లడించిన సర్వే వివరాల్ని ఆయన చెబుతూ.. దేశంలోని లైంగిక విద్య గురించి.. స్త్రీ.. పురుషుల్లో సెక్సు ఎడ్యుకేషన్ గురించి ఉన్న అవగాహనపై 2500 మంది యూత్ తో సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం దేశంలోని యూత్ కు సెక్సు గురించి పెద్ద అవగాహన లేదని చెప్పారు. దేశంలోని యూత్ కు సెక్సు అంటే పోర్న్ అనే అపోహ ఉందని.. పోర్న్ లో మహిళల్ని నీచంగా చూడటంతో పాటు.. వారిపై హింస ఉంటుందని.. వారినో వస్తువుగా ట్రీట్ చేస్తారని.. కానీ సెక్సు అంటే ఇద్దరు వ్యక్తులు అంగీకార పూర్వకంగా కలుసుకునే పద్దతి అని తెలిపారు.
సెక్సు గురించి అవగాహన తక్కువే అయినా.. దేశంలో 13 ఏళ్లకే సెక్సు గురించి అవగాహన పెరుగుతుందని వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 50 శాతం మంది తమ మొదటి అనుభవం 14- 18 ఏళ్ల మధ్యలో ఉన్నట్లుగా వెల్లడించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. అమెరికా.. యూరప్ లో 17 ఏళ్ల వయసులో సెక్సు చేసినట్లు చెబుతుంటే.. సెక్సు అంటే సిగ్గుపడే భారత్ లో మాత్రం 14 ఏళ్లకే శృంగార అనుభవాన్ని చూస్తున్నట్లుగా వెల్లడైంది. అంతేకాదు.. దేశంలోని 91 శాతం మంది యువతలో వారంలో మూడు లేదంటే నాలుగు సార్లు పోర్న్ చూస్తున్నారని.. 65 శాతం యువ మహిళలు పోర్న్ చూస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 34 శాతం మంది వారంలో మూడు నుంచి  నాలుగు సార్లు చూస్తున్నట్లు చెప్పారు.
అంతేకాదు.. దేశంలో 99.4 శాతం మంది యువకులు హస్తప్రయోగం చేస్తున్నారని.. అమ్మాయిలు సైతం 82 శాతం వరకు జీవితంలో కనీసం ఒక్కసారైనా హస్తప్రయోగం చేసినట్లుగా అంచనా వేశారు. 28 శాతం మహిళలు వారంలో మూడు నుంచి నాలుగుసార్లు హస్త ప్రయోగం చేస్తారని.. ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరు రోజులోకనీసం ఒక్కసారైనా హస్త ప్రయోగం చేసుకుంటున్నట్లుగా తేల్చారు.

Related Posts