కడప
కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో వారసత్వం కోసం పోరు సాగుతోంది. ఇటీవల బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కొవిడ్ కారణంగా మరణించారు. అయితే, ఆయనకు ఇద్దరు భార్యలు ఉండడంతో, ఏ భార్యకు చెందిన సంతానం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టాలన్నదానిపై వివాదం ఏర్పడింది. ఇద్దరి భార్యలకు చెందిన సంతానం... పీఠం తమదంటే తమదని రంగంలోకి దిగడంతో కొత్త పీఠాధిపతి ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు.
వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఏడో తరానికి చెందిన పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా... నూతన పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారితీసింది. మఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.పీఠాధిపతి పదవి తనకే దక్కాలంటున్న పెద్దభార్య కుమారుడు డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడికే ఇవ్వాలని వీలునామా రాశారని చిన్న భార్య చెబుతున్నారు. వారసుల మధ్య విబేధాల నేపథ్యంలో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియలో సందిగ్ధత నెలకొంది.