వరంగల్
1986 బ్యాచ్ కి చెందిన డాక్టర్ ల బృందం, కాళోజి యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ప్రవీణ్ ఈరోజు ఎంజీఎం లో కరోనా బాధితుల కోసం వివిధ పరికరాలను శనివారం ఎంజీఎం లోని అకడమిక్ హాల్ లో మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ కి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ :
కరోనా పేషంట్ లను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు. 1986 బ్యాచ్ కు చెందిన డాక్టర్ లు, కాళోజి యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ప్రవీణ్ దాదాపు 20 లక్షల విలువ గల ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్, మాస్క్ లు ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ కష్ట కాలం లో అందరూ సేవ దృక్పధం తో అలోచించి ముందుకు రావాలి. ఎంజీఎం లో డాక్టర్ , నర్సు ల సేవలు మరువలేనివి. క్షేత్ర స్థాయిలో వెలువడే లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోని పేషంట్ లకు భరోసా కల్పించాలి. బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం 50 పడకల ను అందుబాటులో పెట్టాం. దనికి ఇంచార్జ్ గా ఉన్న అధికారులు మానిటరింగ్ చేసుకోవాలి. అందరు బాగా పని చేస్తున్నారు.. ఇంకా సీరియస్ గా ఎవరి పరిధిలో వారు బాగా పని చేయలి. మీకు మేము ఉన్నాం.. మీకు ఏ సమస్య వచ్చిన..ఎం కావాలో మాకు తెలియజేయండి అన్నీ విధల సపోర్ట్ చేస్తామని అన్నారు.
మన ముఖ్యమంత్రి, ఎంజీఎం పైన ప్రత్యేక శ్రద్ద తో ఉన్నారు.. ప్రతీ రోజు ఇక్కడ అందుతున్న వైద్యం పైన మమ్ములను అడుగుతున్నారని అన్నారు.