YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

థర్డ్ వేవ్ పట్ల ముందుగానే అప్రమత్తంగా ఉండాలి

థర్డ్ వేవ్ పట్ల ముందుగానే అప్రమత్తంగా ఉండాలి

థర్డ్ వేవ్ పట్ల ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. పిల్లల కోసం ప్రత్యేకంగా సిరిసిల్ల, వేములవాడ లలో మొత్తం 100 బెడ్ లతో ఏర్పాట్లు చేయాలి. 40 లక్షల రూపాయలతో సిరిసిల్ల తరహాలో వేములవాడలో ఆక్సిజన్ ట్యాంకు 20 రోజుల్లోగా ఏర్పాటు. వ్యాక్సిన్ తోనే వ్యాధి నివారణ సాధ్యం. ఇప్పటివరకు జిల్లాలో 1 లక్షా 22 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కె. తారకరామారావు.
సుమారు నాలుగున్నర ఎకరాల సువిశాల స్థలంలో, 22 కోట్ల రూపాయలతో, 100 పడకల సామర్థ్యంతో, అత్యాధునిక సదుపాయాలతో, నియోజకవర్గ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ధార్మిక క్షేత్రంలో నిర్మించిన ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ప్రత్యేక చొరవతో అందుబాటులోకి వచ్చింది.
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో నిర్మించిన ఈ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కె. తారకరామారావు నాఫ్స్కాబ్ చైర్మెన్  కొండూరు రవీందర్ రావు, జెడ్పీ చైర్మన్ శ్రీమతి ఎన్.అరుణ, జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ లతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి మొత్తం కలియతిరిగి ఐసీయూ, జనరల్ వార్డులలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి  కేటీఆర్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో, ప్రత్యేక చొరవతో అత్యాధునిక సదుపాయాలతో ఈ వంద పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, వైద్యుల ప్రత్యేక కృషితో ఆసుపత్రి వేగవంతంగా నిర్మాణం అయిందని అన్నారు. సిరిసిల్ల ఆసుపత్రి తరహాలో ఇక్కడ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. రానున్న 20 రోజుల్లోగా 40 లక్షల రూపాయలతో సిరిసిల్ల తరహాలో ఆక్సిజన్ ట్యాంకు అందుబాటులోకి వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
కరోనా వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి అందరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో రెండు సార్లు జ్వర సర్వే పూర్తయిందని, రెండో దశ కొద్దిగా తగ్గుముఖం పడుతుందని అన్నారు. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం మూడవ దశ వచ్చే అవకాశం ఉన్నందున దానిని ఎదుర్కోవడానికి ముందుగానే అన్ని చర్యలు తీసుకుని సంసిద్ధమై ఉండాలన్నారు. వేములవాడ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో, సిరిసిల్ల లో అనువైన ప్రదేశాన్ని గుర్తించి పిల్లల కోసం ప్రత్యేకంగా మొత్తం 100 పడకలతో చికిత్స కేంద్రం ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించారు. బ్లాక్ వైట్ ఫంగస్ కు సంబంధించి మందులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, యాంటీ ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. గతంలో లాగా ఐసోలేషన్ సెంటర్లకు స్పందన లేదని, కాబట్టి పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారికి టెలీ మెడిసిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Related Posts