YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా కట్టడి లో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

కరోనా కట్టడి లో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

కడప మే 30,
కడప కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నీది ఆంజనేయులు మాట్లాడుతూ, దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా ను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి అని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. నేడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. మనదేశంలోనే కరోనా వ్యాక్సిన్ తయారు అయినప్పటికీ అందరికీ వ్యాక్సిన్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇతర దేశాలలో 12 సంవత్సరములు పైబడిన వారికి సైతం వ్యాక్సిన్ అందిస్తుంటే, మనదేశంలో 45 సంవత్సరాలు పైబడిన వారికి కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంత నిర్ణయం తీసుకుని, గ్లోబల్ టెండర్లకు వెళ్లి, వ్యాక్సిన్ కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రజలకు ఇస్తాము అన్న ఆలోచన సైతం చేయడం లేదన్నారు. ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ ఇంకా పూర్తిస్థాయిలో అందించ లేకుండా ఉన్నారన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వారు ప్రజల రక్తాన్ని పీల్చుతూ ఉంటే అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. కరోనా కారణంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలారు అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎన్నో మూతపడి ఎంతోమంది జీవనాధారం కోల్పోయారన్నారు. తక్షణమే ప్రతి కుటుంబానికి, కేంద్రం 7,500 రూపాయలు, ప్రతినెల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్రోలు డీజిల్ ధరలు నెలలోనే 13 సార్లు పెంచారని, పెట్రోల్ డీజిల్ లను జిఎస్టి పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని డిమాండ్ చేశారు. జర్మన్ షెడ్లు  కడపలో సైతం నిర్మించాలని డిమాండ్ చేశారు. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిని గవర్నమెంటు ఆధీనంలోకి తెచ్చుకొని, కరోనా రోగులకు పూర్తి ఉచిత వైద్యం, పూర్తిగా ఉచితంగా మందులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు తిరుమలేష్ ,శ్రీనివాసులు, అలీ ఖాన్, రైతు నేత కృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్యామల దేవి ,నగర మహిళా అధ్యక్షురాలు లావణ్య ,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పలి పుల్లయ్య ,ఎన్ఎస్యుఐ నేత బాబు, బీసీ నేత సురేష్, హరి, ఖయ్యుం, యేసయ్య, సాయి, కుమార్, సత్య తదితరులు పాల్గొన్నారు. 

Related Posts