YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

రాజస్థాన్ లో షాకింగ్ మర్డర్

రాజస్థాన్ లో షాకింగ్ మర్డర్

జైపూర్, మే 30,
ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. కారును వెంబడించి అందులోకి దంపతులను హత్యచేసిన ఘటన రాజస్థాన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శుక్రవారం సాయంత్రం 4.45 నిమిషాలకు భరత్‌పూర్ జంక్షన్‌లో ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన దుండగులు కారును అడ్డగించి అందులోని భార్యభర్తలను కాల్చిచంపారు. ముందు కొద్ది దూరం నుంచి కారును అనుసరించిన నిందితులు.. తర్వాత జంక్షన్ వద్ద ముందుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్‌ ప్రకారం.. ‘‘ఇద్దరు యువకులు భరత్‌పూర్ జంక్షన్ వద్ద తొలుత కారును బైక్‌తో అధిగమించి ముందుకెళ్లి ఆపారు.. కారుకు అడ్డంగా బైక్‌ను ఉంచారు. తర్వాత నడుచుకుంటూ కారు దగ్గరకు రాగా... డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి అద్దాలు కిందకు దించగానే ముఖం కనిపించకుండా గులాబీ రంగు వస్త్రాన్ని చుట్టుకున్న ఓ యువకుడు వారిపై పలుసార్లు కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు’’. హత్యకు గురైన దంపతులను వైద్యులుగా గుర్తించారు. ఇది ప్రతీకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. రెండేళ్ల కిందట ఓ యువతి హత్య కేసుతో దీనికి సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
రెండేళ్ల కిందట ఓ యువతి హత్యకు గురికాగా..... ఇందులో వైద్య దంపతుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. హత్యకు గురయిన ఆ యువతితో వైద్యుడికి అక్రమ సంబంధం ఉంది. ప్రస్తుతం వైద్యుడిపై కాల్పులు జరిపిన వ్యక్తిని ఆ యువతి సోదరుడిగా గుర్తించారు. యువతి హత్య వెనుక వైద్యుడి భార్య, తల్లి హస్తం ఉందని ఆరోపణలు రావడంతో కేసు నమోదయ్యింది. తన సోదరి హత్యకు వైద్యుడే కారణమని ప్రతీకారం పెంచుకున్న యువకుడు.. ఆ దంపతులను పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులు జరిపి హత్యచేశాడు.నిందితులను అనూజ్‌ కుమార్‌, మహేష్ కుమార్‌గా... హతమైన వైద్యులను సీమా, సుదీప్‌లుగా గుర్తించారు. భరత్‌పూర్‌కు చెందిన దీపా గుర్జార్, ఆమె ఆరేళ్ల కుమారుడిపై నవంబరు 2019లో డాక్టర్ సీమా గుప్తా రసాయనాలతో దాడిచేసింది. దీంతో ఇరువురూ అక్కడికక్కడే చనిపోయారు. డాక్టర్ సుదీప్ గుప్తాతో దీపకు అక్రమ సంబంధం ఉందని తెలియడంతో ఈ విషయం గురించి సీమ తన అత్తకు తెలియజేసింది. తన భర్త ఆమెకు ఖరీదైన అపార్ట్‌మెంట్ కొనిచ్చినట్టు తెలుసుకుని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చూసింది. పథకం ప్రకారం హత్యచేసింది. దీనికి అత్త సులేఖ గుప్తా కూడా సాయం చేసింది.
ఈ కేసులో అరెస్టయిన సీమా.. కొద్ది రోజుల కిందటే పేరోల్‌పై బయటకు వచ్చింది. ఇరు వర్గాలూ రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని, డాక్టర్ సుదీప్ రూ.50 లక్షలు చెల్లించడానికి అంగీకరించగా.. అనూజ్ మాత్రం ఎక్కువ మొత్తం డిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇంతలోనే వైద్యులను అనూజ్ హత్యచేశాడని అన్నారు.

Related Posts