YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మరో 10 రోజులుల లాక్ డౌన్..?

మరో 10 రోజులుల లాక్ డౌన్..?

హైదరాబాద్, మే 30,
తెలంగాణలో కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. అయితే లాక్ డౌన్ మరోసారి పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పొడగించే అవకాశాలు ఉన్నాయి. కేసులు అదుపులోకి రాకపోవడం, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో లాక్ డౌన్ పెంచడం మినహా ప్రభుత్వం దగ్గర మరో మార్గం లేదని పలువురు నిపుణులు, రాజికీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెల 31తొ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ముగియనుంది. ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరుగుతోంది.ఈ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపు, కరోనా చికిత్స, ధాన్యం కొనుగోలుపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గే వరకు మరో నెల రోజుల వరకు లాక్ డౌన్ విధించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. సెకండ్ వేవ్ లాక్ డౌన్ విధించుకునే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ పొడిగించారు. మరోవైపు తెలంగాణలో గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు నిర్వహించారు. 3,527 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 519 మంది కొవిడ్ బారినపడ్డారు.

Related Posts