YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాక్ డౌన్ అష్ట దిగ్బంధనం కన్నా సామూహికంగా టీకాలు వేయడమే ఉత్తమం... ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల సలహా

లాక్ డౌన్ అష్ట దిగ్బంధనం కన్నా సామూహికంగా టీకాలు వేయడమే ఉత్తమం... ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల సలహా

భువనేశ్వర్ మే 30,
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి అష్ట దిగ్బంధనం కన్నా సామూహికంగా టీకాలు వేయడమే ఉత్తమమని నిపుణులు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. అష్ట దిగ్బంధనం వంటి చర్యలను అమలు చేయడం కన్నా అందరికీ వ్యాక్సినేషన్ చేయించడం వల్ల సత్ఫలితాలు వస్తాయని వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు చెప్పారు. ఖర్చుకు తగిన ఫలితం రావడంతోపాటు, ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. ఒడిశా వ్యాక్సినేషన్ అడ్వయిజరీ కమిటీ తొలి సమావేశంలో వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కమిటీ సమావేశానికి డాక్టర్ కే శ్రీనాథ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ వర్చువల్ సమావేశంలో డాక్టర్ దేవి షెట్టి, డాక్టర్ ఆర్ పాండా, డాక్టర్ సుబ్రత్ ఆచార్య, డాక్టర్ లలిత్ కాంత్, డాక్టర్ మృదుల ఫడ్కే, డాక్టర్ దత్తేశ్వర్ హోటా, డాక్టర్ ఈ వెంకట రావు, డాక్టర్ సంఘమిత్ర పతి, డాక్టర్ ఎంఆర్ పట్నాయక్, డాక్టర్ అజయ్ పరిడ, డాక్టర్ సీబీకే మొహంతి (కన్వీనర్) పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారిపై ప్రజల్లో చాలా ఆందోళన ఉందన్నారు. మూడో ప్రభంజనం ప్రభావం బాలలపై ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారన్నారు. ఈ మహమ్మారిని భవిష్యత్తులో ఎలా ఎదుర్కొనాలో దేశంలోని ఆరోగ్య రంగ నిపుణులు సలహాలు ఇవ్వాలని కోరారు.

Related Posts