YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రోడ్డున పడ్డ రోల్డ్ గోల్డ్ పరిశ్రమ

రోడ్డున పడ్డ రోల్డ్ గోల్డ్ పరిశ్రమ

విజయవాడ, మే 31, 
బందరు రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమపై కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌ 25 నుంచి జ్యూయలరీ పార్కుకు పూర్తి స్ధాయి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆభరణాల తయారీ నిలిచిపోయింది. వరుసగా రెండో సీజన్లోనూ మూతపడడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. తయారీ నిలిచిపోవడంతో 25 వేల మంది పీస్‌ వర్క్‌ కార్మికులు ఆదాయాన్ని కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాల తయారీ పరిశ్రమకు బందరు పెట్టింది పేరు. బందరులోని పోతేపల్లి ఇమిటేషన్‌ జ్యూయలరీ పార్కులో, వెలుపలా ఉన్న 340 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లలో నెలవారీ టర్నోవర్‌ రూ.20 కోట్లుగా ఉంటుంది. ఇక్కడ తయారైన ఆభరణాలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, కొల్‌కత్తా, ఢిల్లీ ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని పలు పట్టణాలకు రవాణా అవుతాయి. కరోనా ఫస్ట్‌వేవ్‌ లాక్‌డౌన్‌ తర్వాత ఈ పరిశ్రమ టర్నోవర్‌ సగానికి అంటే రూ.10 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్నోవర్‌ క్రమంగా పెరిగి రూ.15 కోట్లకు చేరింది. పరిశ్రమ కాస్త కోలుకుంటుందనగానే కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమవడంతో మన రాష్ట్రంతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూ, మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టడంతో వ్యాపారం మరోసారి కుంటుబడింది. స్థానికంగానూ పాజిటివ్‌ కేసులు పెరగడంతో ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి రోల్డ్‌గోల్డ్‌ తయారీదారులు పూర్తిగా తయారీని నిలిపివేసి లాక్‌డౌన్‌ ప్రకటించారు. వరుసగా రెండేళ్ల నుండి ఆదాయాలు కోల్పోవడంతో పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆందోళన చెందుతున్నారు. రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమలో ప్రత్యక్షంగా ఐదు వేల మంది పని చేస్తున్నారు. రాగి తీగలు చుట్టడం, డిజైన్లు అద్దడం, పూసలు ఎక్కించడం, ఎలక్ట్రిక్‌ ప్లేటింగ్‌తో నగిషీలు చెక్కడం, ప్యాకింగ్‌ చేయడం తదితర పనులను మరో 25 వేల మంది కార్మికులు చేస్తున్నారు. వీరికి పీస్‌ వర్కు ప్రాతిపదికన చెల్లింపులు జరుగుతాయి. కిలో ఆభరణాలు తయారు చేసే కార్మికునికి రోజుకు రూ.400 ఆదాయం వచ్చేది. నెల రోజులుగా పనులు లేకపోవడంతో ఆదాయాలు కోల్పోయి వీరంతా పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయినేను, నా కుమారుడు గాజులు తయారు చేస్తాం. జత గాజులకు రూ.1.50 ఇచ్చే వారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.350 ఆదాయం వచ్చేది. కంపెనీ మూతపడడంతో పనిలేక ఆదాయం కోల్పోయాం. కుటుంబం గడవడం లేదు. పస్తులతో ఉండాల్సి వస్తోంది. కొంతమంది కార్మికులు కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉపాధి కోల్పోయిన అసంఘటిత కార్మికులను కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరహాలో ప్రభుత్వం ఆరు నెలలపాటు ఆదుకోవాలని వెంకటయ్య కోరుతున్నారు.

Related Posts