YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోమ్మనకుండా పొగ పెడుతున్నారా

పోమ్మనకుండా పొగ పెడుతున్నారా

విజయవాడ, మే 31, 
వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు విష‌యంలో చాలా క్లియ‌ర్‌గా ఉన్నారు. మ‌రి మోడీ కూడా అలానే ఉన్నారా ? అనేది కీల‌క ప్రశ్న. ప్రత్యేక హోదా, పోల‌వ‌రం నిధులు.. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు వంటి విష‌యాలే కాకుండా.. గ‌త ఏడాది లాక్‌డౌన్ కార‌ణంగా త‌లెత్తిన ఆర్థిక న‌ష్టాల నుంచి కూడా ఏపీని ఆదుకోవ‌డంలో మోడీ స‌ర్కారు ఒకింత విఫ‌ల‌మైంది. అయినా.. జ‌గ‌న్ `ప్లీజ్‌.. ప్లీజ్‌“ అంటున్నారే త‌ప్ప.. యుద్ధానికి మాత్రం సిద్ధమ‌వ‌లేదు. పైగా ముఖ్యమంత్రుల‌తో ప్రధాని స‌మీక్షలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోడీపై అసంతృప్తి వ్యక్తం చేస్తే జ‌గ‌న్ ఆఘ‌మేఘాల మీద మోడీకి మ‌ద్దతుగా హేమంత్‌ను త‌ప్పుప‌ట్టడం జాతీయంగా చ‌ర్చనీయాంశ‌మైంది. మోడీకి జ‌గ‌న్ ఎంత సాగిల‌ప‌డుతున్నాడో ? అన్న చ‌ర్చలు కూడా న‌డిచాయి. జ‌గ‌న్ తాను మోడీకి ఎంతో స‌పోర్టర్‌ను అన్నది ప‌దే ప‌దే చెప్పుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ విష‌యంలోను, నిధుల విష‌యంలోనూ కూడా మోడీ స‌ర్కారు ఏపీకి స‌హ‌క‌రించ‌డం లేదు. కేంద్ర ప్రభుత్వం 18 నుంచి 45 మధ్య వయసు వారికి కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రారంభించాలని ఏప్రిల్‌ 15వ తేదీన నిర్ణయించింది. దీనికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతోపాటు వ్యా క్సిన్‌ ఉత్పత్తి కంపెనీలతో సొంతంగా మాట్లాడుకోవాలని కూడా రాష్ట్రాలకు సూచించింది. ఏప్రిల్‌ 20 నుంచి 29వ తేదీ వరకూ వ్యాక్సిన్‌ కంపెనీలతో చర్చించుకుని, మే 1వ తేదీ నుంచి ‘టీకా ఉత్సవ్‌’ ప్రారంభించాలని కేంద్రం సూచించింది. కానీ, ఇంతలోనే మ‌ళ్లీ కేంద్రం ప్లేట్ ఫిరాయించి.. వ్యాక్సిన్‌ను త‌న అదుపులోకి తెచ్చుకుంది. దీంతో ఏపీలో కేసులు ఎక్కువ‌గా ఉన్నప్పటికీ.. వ్యాక్సిన్ కేటాయింపులు మాత్రం చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఇక‌, ఆక్సిజన్ స‌ర‌ఫ‌రా విష‌యంలోనూ కేంద్రం పైనే ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏపీకి దాపురించింది. అయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ మాత్రం ప‌న్నెత్తు మాట అన‌డం లేద‌ని.. విమ‌ర్శలు వ‌స్తున్నాయి. కానీ, ఈ విష‌యంలో లోతుగా ప‌రి శీలన చేస్తే.. బీజేపీని త‌ప్పుప‌ట్టేలా.. తాను వ్యాఖ్యలు చేయ‌కుండానే.. ప్రజ‌ల నుంచి ఆ పార్టీ దూర‌మ‌య్యేలా జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తున్నార‌ని.. ప్రజ‌లు బీజేపీ నేత‌లు చేస్తున్న ప‌నుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నార‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఆశించింది జ‌రుగుతుందా ? అనేది చూడాలి.

Related Posts