YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ చలవతోనే కేసీఆర్ సీఎం అయ్యారు : పోన్నాల

కాంగ్రెస్ చలవతోనే కేసీఆర్ సీఎం అయ్యారు : పోన్నాల

సీఆర్ యాదృచ్చికంగా ముఖ్యమంత్రి అయ్యారు. అనుకోని పరిస్థితులలో ఆయన “అక్కిడెంటల్ సీఎం  అయ్యారు. ఆయన అబద్దాలు తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లు వేశారని మాజీ పీసీసీ ఛీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.  మాయమాటలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి, అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసిఆర్ ఇంకా తన మోసపూరిత విధానాలతో ప్రజలను రానున్న ఎన్నికలలో కూడా మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయుతే, దేశం అంత ఆయన అబద్దాలు వినడానికి సిద్ధంగా లేదు. ఆయన బీజేపీ, మోడీ కోవర్ట్.  కాంగ్రెస్ ను ఓడించేంచేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఆయన సీఎం అయ్యారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనిషి కేసీఆర్ అని విమర్శించారు. కాంగ్రెస్ ఏమి చేసిందని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్  తెలంగాణ సీఎం అయ్యాడంటే అది కాంగ్రెస్ చలవతోనే. అది మర్చిపోవొద్దు.. “తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే” రకంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ కు అన్ని ఎదురు దెబ్బలే. మూడో ఫ్రంట్ కు ఆది లోనే అన్నీ అడ్డంకులే. నిన్న స్టాలిన్ (డీఎంకె) మొఖం మీదనే కాదని తేల్చేశారు. కాంగ్రసేతర ప్రత్యామ్నాయం దేశంలో ఉపయోగం లేదని  తేల్చి స్టాలిన్ చెప్పారని అయన అన్నారు. కావేరి సమస్య పై బీజేపీ ప్రభుత్వ తాత్సారం, జేడీఎస్ కు  మద్దతు పలుకుతున్న కెసిఆర్ ( బీజేపీ , జేడీఎస్ల  అవగాహన నేపధ్యం లో ) మా మద్దతు ఎలా ఆశిస్తారు అని స్టాలిన్ ప్రశ్నించారని పోన్నాల అన్నారు. మమత బెనర్జీ ని కలిస్తే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎలా సాధ్యం అన్నారు. హేమంత్ సొరేన్ ను కేసీఆర్ కలిసిన మరుసటి రోజే సోనియా గాంధీ తో భేటీ అయ్యారని అయన గుర్తు చేసారు. ఇక నవీన్ పట్నాయక్ అయుతే, “కేసీఆర్ ను నేను ఆహ్వానించలేదు ఆయన వస్తా అంటే రమ్మన్నాను.. రాజకీయాలు ఏమి లేవు అని కొట్టి పారేశారని అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మరింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. “కేసీఆర్ మూడో ఫ్రంట్ మూసి లాంటిది, కంపు కొడుతుంది” అని అన్నారు.  మూడో ఫ్రంట్ అడ్డం పెట్టుకొని తన పార్టీలోని అంతర్గత రాజకీయాలను అధిగమించాలని కేసీర్ అడుగులు వేస్తున్నారని పోన్నాల వ్యాఖ్యానించారు. 

Related Posts