YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్*

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్*

*కరోనా తగ్గిన తర్వాత కొత్త రోగాలు - జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు*
కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉంటోంది. అయితే వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. కరోనా నుంచి కోలుకున్నామని కాస్త కుదుటపడేలోపే చాలా మందిలో షుగర్‌‌‌‌, బీపీ, లంగ్ ఫైబ్రోసిస్‌‌, హార్ట్ ఎటాక్‌‌ వంటి జబ్బులొస్తున్నాయి. బ్లాక్​ ఫంగస్, క్యాండిడా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కొంత మందిలో కిడ్నీలు పాడవడం, అర్థరైటీస్‌‌, థైరాయిడ్ వంటి జబ్బులూ కనిపిస్తున్నాయి. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయిన సగం మందిలో పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్లు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనాతో తీవ్రంగా జబ్బు పడిన పిల్లల్లోనూ టైప్ వన్ డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కార్పొరేట్‌‌, ప్రైవేట్ ఆస్పత్రులకు వందలాది మంది పేషెంట్లు వెళ్తున్నారు. 
*ఇమ్యూనిటీ సిస్టమ్ అతిగా స్పందించడంతోనే..!*
మన శరీరంలోకి కరోనా వైరస్ ​ప్రవేశించగానే దాన్ని ఎదుర్కొనేందుకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ సిద్ధమవుతుంది. వెంటనే యాంటిబాడీల‌‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, కొంత మందిలో రోగనిరోధక శక్తి అతిగా స్పందించడం వల్ల, సైటోకైన్ స్టార్మ్ ఏర్పడి లెక్కలేనన్ని యాంటిబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి కరోనాతో పాటు, మన శరీరంపైనా దాడి చేస్తున్నాయి. దీని వల్లే బ్లడ్ క్లాట్స్, టిష్యూ డ్యామేజ్ వంటి పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల రక్తప్రసరణ దెబ్బతిని గుండె పోటు వంటి ప్రాణాంతక జబ్బులు వస్తున్నాయి. ఈ యాంటీబాడీస్‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేసేందుకు ఇమ్యూనిటీని తగ్గించే స్టెరాయిడ్స్‌‌‌‌‌‌‌‌ను వాడాల్సి వస్తోంది. అప్పటివరకూ స్టెరాయిడ్స్ ఉపయోగపడినా, అటు తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మ్యూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కరోనా సోకిన చాలా మందిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. కొన్ని రోజుల పాటు తక్కువ ఆక్సిజన్​లెవల్స్‌‌‌‌‌‌‌‌తోనే నెట్టుకొస్తున్నారు. దీంతో గుండెకు, ఊపిరితిత్తుల‌‌‌‌‌‌కు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. ఆక్సిజన్ తగ్గడంతో ఆ ప్రభావం గుండె కండరాలపై పడడంవల్ల కొంత మంది గుండెపోటు వచ్చి చనిపోతున్నారని కార్డియాలజిస్టులు చెప్తున్నారు. చాలా మందిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తుల‌‌‌‌‌‌‌ పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడడం లేదు. ఇలాంటివారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందేనని పల్మనాలజిస్టులు సూచిస్తున్నారు.
*షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దీర్ఘకాలిక ఇబ్బందులే*
కరోనా సోకిన చాలా మందిలో డయాబెటీస్ సమస్య కూడా వస్తోంది. కేవలం కరోనాతోనే కొంత మంది డయాబెటీస్ పేషెంట్లుగా మారుతున్నారు. అంతకు ముందే డయాబెటీస్ ఉన్నవాళ్లలో కరోనాతో షుగర్ లెవల్స్‌‌‌‌‌‌‌‌ విపరీతంగా పెరుగుతున్నాయి. పాంక్రియాజ్‌‌‌‌‌‌‌‌పై కరోనా ఎటాక్ చేయడం వల్లే ఇలా జరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. పాంక్రియాజ్‌‌‌‌‌‌‌‌లో ఇన్సులిన్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేసే బీట కణాలు ఉంటాయి. వైరస్ ఈ కణాల్లోకి చొరబడి, వాటిని నాశనం చేస్తోంది. దీంతో ఇన్సులిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి తగ్గిపోవడం/ఆగిపోవడం జరుగుతోందని డాక్టర్లు  అంటున్నారు. దీంతో బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చక్కెర లెవల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమాంతం పెరుగుతున్నాయి. కరోనా తర్వాత కొన్ని రోజులకు షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్స్ తగ్గుతున్నా, పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. కొంత మందిలో షుగర్ ఉన్నా, కరోనా తర్వాత ఆ విషయం బయటపడుతుండగా, ఇంకొంత మంది కరోనా కారణంగానే షుగర్ బాధితులుగా మారుతున్నారు. పిల్లల్లోనూ ఈ సమస్య తలెత్తుతోందని డాక్టర్లు చెప్తున్నారు.
*పిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్*
కరోనా సోకిన పిల్లల్లో కొంతమంది టైప్ వన్ డయబెటీస్ కు గురవుతున్నారు. పాంక్రియాజ్‌‌‌‌‌‌‌‌పై కరోనా దాడి చేయడంవల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతోంది. ఇక జీవితాంతం ఇలాంటివాళ్లు ఇన్సులిన్‌‌‌‌‌‌‌‌ వాడాల్సిందే. అయితే, ఇది చాలా అరుదుగా, కొన్ని కేసుల్లో మాత్రమే కనిపిస్తోంది. పెద్ద వాళ్లలో మాత్రం ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. షుగరే కాదు.. పోస్ట్‌‌‌‌‌‌‌‌ వైరల్ రియాక్టివ్ అర్థరైటీస్‌‌‌‌‌‌‌‌, థైరడైటీస్‌‌‌‌‌‌‌‌ వంటి సమస్యలు కూడా వస్తున్నయి.
*50% మందిలో యాంగ్జయిటీ*
కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ తీసుకుని ఇంటికెళ్లిన చాలా మంది పోస్ట్ ట్రామాటిక్ స్ర్టెస్ డిజార్డర్స్‌‌‌‌‌‌‌‌తో బాధ పడుతున్నారు. సగం మందిలో యాంగ్జయిటీ కనిపిస్తోంది. నిద్రపట్టకపోవడం, సూసైడల్ థాట్స్‌‌‌‌‌‌‌‌, అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్‌‌‌‌‌‌‌‌ వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం చేసినవాళ్లూ ఉన్నారు. ఇవన్నీ తగ్గడానికి చాలా టైమ్ పడుతోంది. కరోనా పేషెంట్ల విషయంలో ఇంట్లో వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
*రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి*
కరోనా ఎక్కువగా మన శరీంలోని రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇమ్యూనిటీ లేకపోవడంతో నీరసం, ఒళ్లు నొప్పులు, నిద్రలేమి వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే వైద్యులు సూచించిన మందులు వాడుతూ రెస్ట్ తీసుకోవాలి. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో అన్ని రకాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్‌ వంటివి రోజూ తీసుకోవాలి. షుగర్‌‌, బీపీ రెగ్యులర్‌‌గా చెక్ చేయించుకోవాలి. గుండె, మెదడు సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌‌ను కలవాలి. కరోనా రీఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు మాస్క్, పరిశుభ్రత, భౌతికదూరం.. ఈ మూడు విషయాలు  తప్పకుండా పాటించాలి.
*రక్తం గడ్డకట్టడమే సమస్య*
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ‌ సమస్యలతో చాలా మంది ఆస్పత్రులకు వెళ్తున్నారు. రక్తంలో ఏర్పడుతున్న క్లాట్స్‌‌తోనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. రక్త నాళాల్లో క్లాట్స్‌‌ ఏర్పడి, బ్లడ్ ప్రెజర్ తగ్గుతోంది. గుండెకు, మెదడు‌కు రక్త ప్రసరణ సరిగా లేకపోతే స్ట్రోక్, ఇతర సమస్యలు వస్తాయి. కరోనా పేషెంట్లలో జరుగుతున్నది ఇదే. కిడ్నీల పరితీరు దెబ్బతినడానికి కూడా ఇదే కారణం. ఊపిరితిత్తులకు ఆక్సిజన్, రక్తం సరఫరా ఆగిపోయి లంగ్ ఫైబ్రోసిస్ వస్తోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జయిన తర్వాత కూడా డాక్టర్లను సంప్రదించి సలహాలు తీసుకోవాలని పేషెంట్లకు సూచిస్తున్నారు. బ్లడ్ క్లాట్స్‌‌ అవుతున్నాయా, లేదా అనేది డీడైమర్ వంటి టెస్టుల ద్వారా  ముందే గుర్తించొచ్చని వైద్యులు అంటున్నారు.
*కరోనా తర్వాత ఇవీ సమస్యలు*
* కొందరిలో కరోనా తగ్గాక డయాబెటీస్ సమస్య వస్తోంది. ముందే డయాబెటీస్ ఉన్నవాళ్లలో కరోనా వల్ల షుగర్ లెవల్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి.
* మరికొందరిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తుల పనితీరు మెరుగవడం లేదు.  కిడ్నీల పనితీరు కూడా సరిగా ఉండడం లేదు.
* మరికొందరిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. దీంతో గుండెకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. ఆ ప్రభావం గుండె కండరాలపై పడి గుండె పోటు వస్తోంది.
*నిద్రపట్టకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు, అడ్జస్ట్​మెంట్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్‌ వంటి ఇబ్బందులతో కొందరు బాధపడుతున్నారు.
*చికిత్స సమయంలో స్టెరాయిడ్స్‌ వాడిన వాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల మ్యూకర్‌‌ మైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి.
************************
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
AP STATE నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*

Related Posts