YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పీవీ నరసింహారావు మార్గ్ గా నెక్లెస్ రోడ్ పేరు మార్పు

పీవీ నరసింహారావు మార్గ్ గా నెక్లెస్ రోడ్ పేరు మార్పు

హైదరాబాద్ మే 31
సీఎం కేసీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మహా నగరానికే నెక్లెస్ తరహాలో ఉన్న నెక్లెస్ రోడ్ పేరు ఇక మీదట పీవీ నరసింహారావు మార్గ్ గా నామకరణ చేసినట్లు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఈ నామకరణ చేసినట్లు తెలంగాణ క్యాబినెట్ వెల్లడించింది. అంతేకాకుండా నెక్లెస్ రోడ్ లో పీవీ నరసింహారావు ఘాట్ కూడా ఉంది. నరసింహారావు మరణించిన అనంతరం 12 ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఘాట్ ను నిర్మించింది. అయితే హుస్సేన్ సాగర్ ను ఆనుకొని ఐదున్నర కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ నెక్లెస్ రోడ్డు పేరును మార్చాలని కేబినెట్ లో తీర్మానించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా పీవీ నరసింహారావు పేరు పెట్టాలంటూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇక మీదట నెక్లెస్ రోడ్ను పీవీ నరసింహారావు మార్క్ గా పిలవనున్నారు. ప్రేమికులకు పర్యటకులకు ఎంతో ఆహ్లాదకరమైన నెక్లెస్ రోడ్డు పేరు ఇకపై పీవీ నరసింహారావు మార్గ్ గా మారిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా ముందుకు వచ్చి నాలుగు కూడలి రోడ్డులో ముందుకు వెళితే సెక్రటేరియట్ కుడి వైపునకు తిరిగితే ప్రసాద్ ఐమ్యాక్స్ ఎడమ వైపునకు తిరిగితే ఐదున్నర కిలోమీటర్ల నిడివి ఉండే నెక్లెస్ రోడ్ తెలిసిందే. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించే నెక్లెస్ రోడ్డుకు అనూహ్యమైన పేరును డిసైడ్ చేశారు సీఎం కేసీఆర్.

Related Posts