YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న "తీరం" మోషన్ పోస్టర్ విడుదల!!

రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న "తీరం" మోషన్ పోస్టర్ విడుదల!!

అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరో, హీరోయిన్లుగా  అనిల్ ఇనమడుగు దర్శక,నిర్మాతగా రూపొందిస్తున్న రొమాంటిక్  థ్రిల్లర్ చిత్రం "తీరం". ఈ చిత్రం టైటిల్,  మోషన్ పోస్టర్ ను మే 30న హైదరాబాద్  ఫిలిం నగర్లోని దైవ సన్నిధానంలో చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  తీరం సినిమా హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, మై విలేజ్ షో అనిల్, అజయ్ సన్నపు, విజయం పన్నేరు, అజస్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ- ' పూర్తి స్థాయి సంగీతం మరియు సస్పెన్స్ తో  కూడిన రొమాంటిక్  ప్రేమకథాచిత్రంగా తీరం సినిమాని రూపొందించాం.  సినిమా అంతా  ఒక హృద్యమైన మ్యూజికల్ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుంది. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు అంతర్లీనంగా కామిడీ  కొనసాగుతూ, ప్రస్తుతం యువతరానికి పూర్తి స్థాయిలో నచ్చేలా తీరం ఉండబోతుంది.   ప్రముఖ గాయకులు  స్వర్గీయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు, తను అనారోగ్యానికి గురికావడానికి  మూడు రోజులు ముందుగా చెన్నైలోని కోదండఫాణి సినీ స్టూడియోలో  మా తీరం చిత్రం కోసం "ఏంటీ ప్రేమా" అనే పాట పాడారు. అది సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.. అన్నారు.
సినెటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులెమోని మాట్లాడుతూ.. సినిమా చూశాను.. చాలా బాగుంది. కొత్త వాళ్ళయినా ఒక యంగ్ టాలెంటెడ్ టీమ్ అంతా కలిసి అద్భుతమైన సినిమా చేశారు. మంచి కంటెంట్ తో బ్యూటిఫుల్ విజువల్స్ తో రొమాంటిక్ థ్రిల్లర్ గ అనిల్ ఈ "తీరం" సినిమాని ఎక్స్ లెంట్ గా తెరకెక్కించాడు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు జీవం పోశారు. ఇంత మంచి కథతో ఆడియెన్స్ కి నచ్చేలా తీరం చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అనిల్ ని అభినందిస్తున్నాను.  ఈ చిత్రం నాకు బాగా నచ్చబట్టే మా సినేటెరియా బ్యానర్ ద్వారా లాక్ డౌన్ తర్వాత ధియేటర్స్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం. కచ్చితంగా ఈ తీరం సినిమా సూపర్  హిట్ అయి అనిల్ కు దర్శకుడిగా మంచి పేరు తెస్తుంది..  అన్నారు.
హీరోయిన్ క్రిష్టెన్ రవళి మాట్లాడుతూ- " ఈ సినిమాలో నా  పాత్ర పూర్తి స్థాయిలో బబ్లీ గా , చిలిపిగా ఉంటుంది. సినిమా నిర్మాణం మొత్తం అందమైన ప్రయాణంలా కొనసాగింది.  దర్శక నిర్మాతలు మరియు నటీనటులసహకారం చాలా బాగుంది.  సినిమాలోని నా క్యారెక్టర్   తమ పక్కింటి అమ్మాయిలా వుంది అనుకుంటారు. అంత బాగా నా పాత్రని డిజైన్ చేశారు దర్శకుడు అనిల్. ఈ సినిమా నాకు మంచి బ్రేక్ అయి పరిశ్రమలో నాకంటూ ఒక మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాను.. అన్నారు.
అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మించిన తీరం చిత్రానికి రచన-నిర్మాత- దర్శకత్వం: అనిల్ ఇనమడుగు, సినిమాటోగ్రాఫర్  మరియు ఎడిటింగ్: శ్రావణ్ జి. కుమార్, సంగీతం ప్రశాంత్ బి.జె. .

Related Posts