కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో 150వ రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. సోమవారం ఉదయం పామర్రు నుండి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి దీవంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరు కి చేరుకోగానే జగన్మోహన్ రెడ్డి కి గ్రామస్తులు భారీ స్వాగతం పలికారు. గ్రామంలో నందమూరి తారక రామారావు వారసలమని చెప్పుకునే కొంతమంది నాయకులు గ్రామంలో లో అనేక అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారని మంత్రి లోకేష్ పేరుతో నిబంధనలు కి విరుద్ధంగా మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వుకుని అమ్ముకుని కోట్లు గడిస్తున్నారని నిమ్మకూరు గ్రామస్తులు జగన్మోహన్ రెడ్డి దృష్టి కి తీసుకుని వచ్చారు.
గ్రామస్తుల కోరిక మేరకు అక్రమంగా మట్టి ని తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాన్ని అయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దీవంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వారసులమని చెప్పుకని రాజకీయ పదవులు అనుభవిస్తున్నారని గ్రామంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చేయ్యకపోగా అవినీతి కార్యక్రమాలు ఎక్కవగా చేస్తున్నారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిమ్మకూరు ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటమే గా కృష్ణా జిల్లా పేరును నందమూరి తారకరామారావు జిల్లా గా నామకరణం చేస్తామని హమీ ఇచ్చారు.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి నందమూరి తారకరామారావు అభిమానులు నిమ్మకూరు గ్రామస్తులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు.